తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Harish Rao : కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి, సిద్ధంగా ఉండండి - హరీశ్ రావు కామెంట్స్

BRS Harish Rao : కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి, సిద్ధంగా ఉండండి - హరీశ్ రావు కామెంట్స్

17 July 2024, 14:30 IST

google News
    • BRS MLA Harish Rao : పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. మళ్లీ గులాబీ జెండా ఎగిరేవరకు కష్టపడి పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పటాన్ చెరు ఎమ్మెల్యే పార్టీ వీడటంపై హరీశ్ రావు ఫైర్ అయ్యారు.
మాజీ మంత్రి హరీశ్ రావు
మాజీ మంత్రి హరీశ్ రావు

మాజీ మంత్రి హరీశ్ రావు

BRS MLA Harish Rao : ఎమ్మెల్యేలు పార్టీ మారిన చోట తప్పకుండా ఉప ఎన్నికలు వస్తాయని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం పటాన్‌చెరు బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన… 2001లో కేసీఆర్ ఉద్యమాన్ని పిడికెడు మందితో ప్రారంభించారని గుర్తు చేశారు. అప్పుడు కూడా కుట్రలు జరిగాయని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమ పార్టీకి చెందిన 12మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారని చెప్పారు.

కానీ నాటి కుట్రలు ఫలించలేదన్న హరీశ్ రావు చివరికి న్యాయమే గెలిచిందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ 14 ఏళ్లు పోరాడా రాష్ట్రాన్ని సాధించారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందనన్నవాళ్లు తర్వాత కనిపించకుండాపోయారని వ్యాఖ్యానించారు.

మహిపాల్ రెడ్డిపై విమర్శలు…

“పార్టీకి కష్టాలు వస్తాయి. మీరు ధైర్యంగా ఉండండి. మీ బాధ్యత నేను తీసుకుంటా. మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. ఎమ్మెల్యే పోతే పార్టీ పోదు. పటాన్‌చెరులో మంచి కార్యకర్తలు ఉన్నారు. ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్లీ ఎగిరేది గులాబి జెండానే. మీరందరూ కష్టపడితేనే మహిపాల్ రెడ్డి గెలిచారు. పటాన్‌చెరుకు ఏం కావాలంటే అది ఇచ్చాం. రోడ్లు, తాగునీళ్లు, స్టేడియం వంటి ఎన్నో అందించాం. నిధులు వరద పారించాం. గూడెం పోయినా గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేవరకు నిద్రపోం. మహిపాల్‌ రెడ్డికి మూడుసార్లు టికెట్లిచ్చి గెలిపిస్తే పార్టీ మారడానికి మనసెలా వచ్చింది? ఇది న్యాయామా? నీకిది తగునా…? వైసీపీ నీకు టికెట్ ఇవ్వకపోతే తల్లిలా దగ్గరికి తీసుకుని నీకు టికెట్ ఇచ్చింది పార్టీ” అని హరీశ్ రావు గుర్తు చేశారు.

పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని హరీశ్ రావు చెప్పారు. మళ్లీ గులాబీ జెండా ఎగిరేవరకు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరిగిందో ప్రజలందరూ చూస్తున్నారన్న ఆయన…. కేసీఆర్ పాలనను, కాంగ్రెస్ పాలనతో పోల్చుకుంటున్నారని చెప్పారు. పార్టీ మారితే రాళ్లతో కొట్టండి అన్న రేవంత్ తనే ఇళ్లకు వెళ్లి కండువాలు కప్పుతున్నాడని దుయ్యబట్టారు.

“రుణమాఫీ జీవోలో రేషన్ కార్డు ఆధారంగా రైతు రుణమాఫీ అని చెప్పారు. వ్యతిరేకత వస్తోందని మాట మార్చుతున్నారు. పాస్ బుక్ ఉంటే సరిపోతుందని నోటి మాటతో చెప్తున్నావు. అదే నిజమైతే జీవో మార్చు. వడ్లకు బోనస్ అని తర్వాత సన్నవడ్లకే బోనస్ అంటూ 90 శాతం రైతులకు బోనస్ ఎగ్గొట్టావు. ఇప్పుడు రుణ మాఫీ విషయంలోనూ అదే చేస్తున్నారు. PM కిసాన్ నిబంధనలు ఎందుకు..?రేషన్ కార్డు నిబంధనలు ఎందుకు..? ఆరు నూరైనా సరే రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే. మీరు ధైర్యంగా ఉండండి, స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, ఏ ఎన్నికలు వచ్చినా కష్టపడి పనిచేసి గెలుద్దాం. కాంగ్రెస్ దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఐదేళ్లకు మించి అధికారంలో లేదు” అని హరీశ్ రావు అన్నారు.

ఉప ఎన్నికలు తప్పనిసరి - హరీశ్ రావు

ఎమ్మెల్యే పోతే పార్టీ పోదన్నారు హరీశ్ రావు. పటాన్ చెరులో మంచి కార్యకర్తలు ఉన్నారని…. ఇక్కడ ఎగిరేది మళ్లీ మన జెండానే అని చెప్పారు. పదేళ్ల పాలనలో మనం అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించామని చెప్పారు. కొన్ని విషయాలు విస్మరించామన్న ఆయన… ఇకపై కార్యకర్తలు, నాయకత్వంపై దృష్టిపెడతామన్నారు. పార్టీ మారిన చోట ఉప ఎన్నికలు కచ్చితంగా వస్తాయని స్పష్టం చేశారు. దానికి ఇప్పట్నుంచే సిద్ధం కావాలని… పార్టీ మీకు అండగా ఉంటుందన్నారు.

తదుపరి వ్యాసం