BRS Mla Joins Congress : బీఆర్ఎస్ కు మరో షాక్, కాంగ్రెస్ లో చేరిన పఠాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి-hyderabad patancheru brs mla mahipal reddy joins congress in cm revanth reddy presence ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Mla Joins Congress : బీఆర్ఎస్ కు మరో షాక్, కాంగ్రెస్ లో చేరిన పఠాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

BRS Mla Joins Congress : బీఆర్ఎస్ కు మరో షాక్, కాంగ్రెస్ లో చేరిన పఠాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

Bandaru Satyaprasad HT Telugu
Jul 15, 2024 08:31 PM IST

BRS Mla Joins Congress : తెలంగాణలో కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

బీఆర్ఎస్ కు మరో షాక్, కాంగ్రెస్ లో చేరిన పఠాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
బీఆర్ఎస్ కు మరో షాక్, కాంగ్రెస్ లో చేరిన పఠాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

BRS Mla Joins Congress : బీఆర్ఎస్ కు మరో గట్టి షాక్ తగిలింది. పఠాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నేత గాలి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిద్దరికీ కాంగ్రెస్ కండువా కప్పి సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నీలం మధు, శశికళా యాదవ్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు, ఎమ్మెల్యే అనుచరులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గ్రేటర్ హైదరాబాద్ లో మరికొంత మంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లు చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గూడెం మహిపాల్‌రెడ్డి 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 7వేల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్ పై విజయం సాధించారు. ఇటీవల మహిపాల్ రెడ్డి ఇంట్లో ఇటీవల ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాల నాటికి బీఆర్ఎస్ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం చేసే ప్రక్రియ కొనసాగుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కాంగ్రెస్ లో చేరిన అరికెపూడి

బీఆర్ఎస్ పార్టీని వీడి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ శనివారం కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు పలువురు కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ గూటికి చేరారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి అరికెపూడి గాంధీ 2018, 2023 ఎన్నికల్లో విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీలో పని చేసిన గాంధీ… 2018కి ముందు బీఆర్ఎస్ లో చేరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో విప్ గా కూడా ఉన్నారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టికెట్ ను ఆశించినప్పటికీ దక్కలేదు.

10కి చేరిన చేరికలు

2023 డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున మొత్తం 39 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి. తెల్లా వెంకట్రావ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, కాలె యాదయ్య హస్తం, బండ్ల కృష్ణామోహన్ రెడ్డి గూటికి, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ చేరారు. తాజాగా గూడెం మహిపాల్ రెడ్డితో బీఆర్ఎస్ నుంచి చేరిన కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య పదికి చేరింది. మరికొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి…. కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ నుంచే మరో నాలుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ను వీడుతారని తెలుస్తోంది.

తెలంగాణ అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన కొత్తలో ప్రభుత్వం కూలిపోతుందని కేసీఆర్ అన్న మాటలను గుర్తుచేశారు. ప్రభుత్వాన్ని కూలుస్తామన్న వాళ్లే ఇప్పుడు ప్రభుత్వాన్ని నిలబెడుతున్నారన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం