TS AP Holidays : ఈ నెల 11న స్కూళ్లు, ఆఫీసులకు సెలవు - ఆ తేదీన మరో హాలీ డే
10 April 2024, 12:13 IST
- Holidays in Telugu States: రంజాన్ పండగ((Eid ul-Fitr 2024)) సందర్భంగా ఏప్రిల్ 11వ తేదీన స్కూల్, కాలేజీలతో పాటు ఆఫీస్‌లకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. అయితే వచ్చే వారంలోనే శ్రీరామనవమి కూడా ఉంది. దీంతో ఏప్రిల్ 17వ తేదీన మరో హాలీ డే ఉండనుంది.
ఏప్రిల్ 11న సెలవు
TS AP Holidays : ఏప్రిల్ మాసం వస్తే చాలు… స్కూళ్లు, కాలేజీలకు సెలవులు వస్తుంటాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియతో పాటు పదో తరగతి విద్యార్థులకు వేసవి సెలవులు వచ్చాయి. మరోవైపు తొమ్మిదో తరగతి లోపు విద్యార్థులు ఒంటిపూట బడులకు వెళ్తున్నారు. ఇప్పటికే వేసవి సెలవులు ఖరారు కాగా…. ఈనెలలో ఉగాది(ఏప్రిల్ 9) రోజున సెలవు ప్రభుత్వం సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇంతలోనే రంజాన్ (Ramzan) కూడా వచ్చేసింది. ఏప్రిల్ 11వ తేదీన రంజాన్ పండగ కావటంతో…. గురువారం కూడా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పాఠశాలలకు, ఆఫీసులకు సెలవు దినంగా ఉండనుంది. మరోవైపు బ్యాంకులు కూడా బంద్ కానున్నాయి.
ఏప్రిల్ 17న మరో హాలీ డే…
ఈ ఏప్రిల్ మాసంలోనే శ్రీరామనవమి (srirama navami)కూడా ఉంది. ఇది ఏప్రిల్ 17వ తేదీన వచ్చింది. ఆ రోజు బుధవారం. శ్రీరామనవమి కావటంతో దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెవలు దినంగా ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పాఠశాలలు, ప్రభుత్వ ఆఫీసులు బంద్ కానున్నాయి.
స్కూళ్లకు సమ్మర్ హాలీ డేస్…
ఇక తెలంగాణ ప్రభుత్వం సమ్మర్ హాలీ డేస్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 24వ తేదీన చివరి వర్కింగ్ డేగా ఉంది. ఏప్రిల్ 25వ తేదీ నుంచి పాఠశాలలకు హాల్ డేస్ ఉండనున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో చూస్తే ఏప్రిల్ 24వ తేదీ నుంచి సెలవులు ఉన్నాయి. జూన్ 11 వరకు అన్ని పాఠశాలలు మూతపడనున్నాయి. తిరిగి జూన్ 12న స్కూళ్లు పున: ప్రారంభమవుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.
TS Inter Summer Holidays 2024 : మార్చి 31వ తేదీ నుంచి తెలంగాణలోని అన్ని జూనియర్, ఎయిడెడ్ ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు(TS Inter Summer Holidays 202) ప్రారంభమయ్యాయి. మే 31వ తేదీ వరకు ఈ సెలవులు ఉంటాయని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. జూన్ ఒకటో తేదీన కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. ఇంటర్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ మేరకే ప్రవేశాల ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మరోవైపు ఏపీలోనూ ఇంటర్ కాలేజీలకు సెలవులు కొనసాగుతున్నాయి.