Indore: శ్రీరామనవమి వేడుకల్లో విషాదం; గుడిలో మెట్లబావి పైకప్పు కూలి 13 మంది మృతి-many feared trapped after stepwell at temple in mp s indore collapses ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Indore: శ్రీరామనవమి వేడుకల్లో విషాదం; గుడిలో మెట్లబావి పైకప్పు కూలి 13 మంది మృతి

Indore: శ్రీరామనవమి వేడుకల్లో విషాదం; గుడిలో మెట్లబావి పైకప్పు కూలి 13 మంది మృతి

HT Telugu Desk HT Telugu
Mar 30, 2023 05:35 PM IST

Indore tragedy: మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో శ్రీరామ నవమి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఒక ఆలయంలోని మెట్ల బావి పై కప్పు ఒక్క సారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇండోర్ లో ఆలయంలోని పురాతన మెట్లబావి కుప్పకూలిన దృశ్యం
ఇండోర్ లో ఆలయంలోని పురాతన మెట్లబావి కుప్పకూలిన దృశ్యం

Indore tragedy: మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఒక ఆలయంలోని మెట్ల బావి పై కప్పు ఒక్క సారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.

Indore temple tragedy: మెట్ల బావి పై కప్పు..

ఇండోర్ నగరంలోని పటేల్ నగర్ ప్రాంతంలో బేలేశ్వర్ మహాదేవ్ ఝులేలాల్ ఆలయంలో గురువారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీరామ నవమి ఉత్సవాలు జరుగుతుండడంతో అక్కడ పెద్ద ఎత్తున భక్తులు చేరుకున్నారు. అదే సమయంలో ఆలయంలో ఉన్న పురాతన మెట్ల బావి పై కప్పు ఒక్క సారిగా కుప్పకూలింది. ఆ రాతి కప్పు కింద పదుల సంఖ్యలో భక్తులు చిక్కుకు పోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరగగానే అక్కడ ఉన్న వారు దాదాపు 8 మందిని కాపాడి బయటకు తీసుకువచ్చారు. ప్రమాద సమాచారం తెలియగానే, పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానిక అధికారులు అక్కడికి చేరుకుని బాధితులను కాపాడే ప్రయత్నాలను ప్రారంభించారు. అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచారు. ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా పలువురు భక్తులు ఆ బావిలో చిక్కుకుపోయి ఉన్నారు. ఆ బావి నుంచి 11 మృతదేహాలను వెలికి తీశారని మధ్య ప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. ప్రాణాలతో బయటకు తీసుకువచ్చిన వారిలో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని వెల్లడించారు.

Indore temple tragedy: భారీగా భక్తులు చేరడంతో..

పురాతన బావ్డి (మెట్ల బావి) పై కప్పు కుప్పకూలడంతో దాని కింద సుమారు 25 మంది వరకు చిక్కుకుపోయినట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. ఆ బావి పై కప్పు పైకి పెద్ద ఎత్తున భక్తులు చేరుకోవడంతో, ఆ బరువును తట్టుకోలేక ఆ పురాతన బావి పై కప్పు కుప్పకూలిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాద సమాచారం తెలియగానే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. తక్షణమే సహాయ చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సహాయ చర్యలను సీఎంఓ పర్యవేక్షస్తోంది.

Whats_app_banner