తెలుగు న్యూస్  /  Telangana  /  Brs Leaders Slam Bandi Sanjay For His Statements On Mlc Kalvakuntla Kavitha

BRS Vs Bandi Sanjay : బండి సంజయ్ పై బీఆర్ఎస్ శ్రేణుల ఫిర్యాదులు..

HT Telugu Desk HT Telugu

11 March 2023, 16:15 IST

    • BRS Vs Bandi Sanjay : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై బీఆర్ఎస్ శ్రేణులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నాయి. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కంప్లైంట్ లు ఇస్తున్నాయి. మరోవైపు.. వ్యాఖ్యలను సమోటోగా తీసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్... విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డీజీని ఆదేశించింది.
బండి సంజయ్ పై ఫిర్యాదులు
బండి సంజయ్ పై ఫిర్యాదులు

బండి సంజయ్ పై ఫిర్యాదులు

BRS Vs Bandi Sanjay : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పట్ల రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై.. బీఆర్ఎస్ శ్రేణులు భగ్గమంటున్నాయి. ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న గులాబీ నేతలు... వ్యాఖ్యలపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల బండి సంజయ్ పై ఫిర్యాదు చేశారు. కేసుల నమోదుపై న్యాయ సలహా తీసుకుంటున్న పోలీసులు... అన్నీ ఒకే తరహా ఫిర్యాదులు కావడంతో ఒక పీఎస్‌కు బదిలీ చేసే యోచనలో ఉన్నారు. ఏదైనా ఒక పీఎస్‌కు బదిలీ చేసి, దర్యాప్తు చేసే యోచనలో పోలీసులు ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు

AP TS Weather Updates: మండుతున్న ఎండలు, తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలతో జనం విలవిల

Siddipet News : డబుల్ సైలెన్సర్లు వాడితే వాహనాలు సీజ్, కేసులు కూడా నమోదు- సిద్ధిపేట సీపీ

TS AP Weather : నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్-వడదెబ్బతో ఒకరు మృతి

Cricket Betting : ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణం తీసిన ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టిన కమిషన్... వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని సీరియస్ అయ్యింది. బండి వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించింది. వ్యాఖ్యలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని మహిళా కమిషన్ ఆదేశించింది.

బండి సంజయ్ వ్యాఖ్యలను ప్రతి మహిళ ఖండిస్తోందన్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఆయన ఓ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి.. సంస్కారం మరచి.. ఈర్శతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ ఇంట్లోనూ అమ్మ, భార్య ఉన్నారని... మహిళల పట్ల గౌరవంతో మాట్లాడాలని హితవు పలికారు. కేసీఆర్, కేటీఆర్, కవితను తిట్టడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. దేశ అడబిడ్డల హక్కుల కోసం ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ ధర్నా చేశారన్న ఆమె.. మహిళ అందరం ఏకమవుతామని... మహిళ శక్తి చూపిస్తామని పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను మహిళలు ఖండించాలని.. మరో మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వ్యాఖ్యలకు చోటు లేదని వ్యాఖ్యానించారు. సంజయ్ అధ్యక్షుడు అయ్యాక రాజకీయ విలువలు పడిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమ నేత బిడ్డగా తండ్రి అడుగుజాడల్లో నడిచి తెలంగాణ సాంస్కృతిని ప్రపంచనికి చాటిన వ్యక్తి కవిత అని... తెలంగాణ సాధనలో కీలక భూమిక పోషించిందని చెప్పుకొచ్చారు. కవిత మహిళల రిజర్వేషన్లు కోసం పోరాడితే బీజేపీ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ సీరియస్ అయ్యారు. బండి సంజయ్ మాట్లాడే ప్రతి మాట వ్యక్తిగతమా లేగా పార్టీవా అనే విషయం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ మెడలు వంచే రోజు... పాతాళానికి పంపే రోజులు దగ్గరకు వచ్చాయని వ్యాఖ్యానించారు. కేసులకి భయపడేది లేదని.. కేంద్ర నిరంకుశ వైఖరిపై సమష్టిగా పోరాడతామని స్పష్టం చేశారు.