తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Blackberry Iot Center At Hyd: హైదరాబాద్‌లో బ్లాక్‌బెర్రీ ఐఓటీ సెంటర్.. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద కేంద్రం

BlackBerry IoT center at HYd: హైదరాబాద్‌లో బ్లాక్‌బెర్రీ ఐఓటీ సెంటర్.. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద కేంద్రం

HT Telugu Desk HT Telugu

15 March 2023, 21:33 IST

    • BlackBerry IoT center at Hyderabad: కొత్తగా హైదరాబాద్‌లో తన ఐఒటి సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ, ఇంజినీరింగ్‌, ఇన్నోవేషన్‌ సెంటర్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది బ్లాక్‌బెర్రీ లిమిటెడ్‌. కెనడా తరువాత అంతర్జాతీయంగా బ్లాక్‌బెర్రీ ఐఒటీ డివిజన్‌లలో రెండో అతిపెద్ద కేంద్రంగా ఇది నిలువనుందని ఆ సంస్థ తెలిపింది.
హైదరాబాద్‌లో బ్లాక్‌బెర్రీ ఐఓటీ సెంటర్
హైదరాబాద్‌లో బ్లాక్‌బెర్రీ ఐఓటీ సెంటర్

హైదరాబాద్‌లో బ్లాక్‌బెర్రీ ఐఓటీ సెంటర్

BlackBerry IoT center of excellence in Hyderabad: హైదరాబాద్‌ వేదికగా సరికొత్త కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది బ్లాక్‌బెర్రీ లిమిటెడ్‌. కొత్తగా బ్లాక్‌బెర్రీ ఐఓటీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌, ఇంజినీరింగ్‌ మరియు ఇన్నోవేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ ప్రపంచశ్రేణి ఇంజినీరింగ్‌ కేంద్రం, భారతదేశపు అత్యుత్తమ ఎంబీడెడ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లను నియమించుకోవడం ద్వారా భావితరపు సాఫ్ట్‌వేర్‌ నిర్వచిత వాహనాలు (ఎస్‌డీవీలు) నిర్మించడంలో సహాయపడుతుందని తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు

Koheda Gutta ORR : ఓఆర్ఆర్ పక్కనే ఉన్న కోహెడ గుట్టను చూసొద్దామా..! వ్యూపాయింట్ అస్సలు మిస్ కావొద్దు

Rohith Vemula Case : రోహిత్ వేముల దళితుడు కాదు..! హైకోర్టులో కేసు క్లోజ్ రిపోర్ట్ దాఖలు

Guinness World Record : కేవలం 2.88 సెకన్లలోనే 'Z నుంచి A' వరకు టైపింగ్ - గిన్నిస్‌ రికార్డు సాధించిన హైదరాబాదీ

Leopard in Medak : మెదక్ జిల్లాలో చిరుత సంచారం...! అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

బెంగళూరులో మార్చి 29న జరుగనున్న కంపెనీ యొక్క వార్షిక టెక్‌ ఫోరమ్‌ ఇండియాకు ముందుగా, తమ మిషన్‌ క్రిటికల్‌ ఎంబీడెడ్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ మరియు ఇంజినీరింగ్‌ సేవల కోసం భారత్ తో పాటుగా అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్‌ను అందుకునేందుకు వీలుగా తమ కార్యకలాపాలను విస్తరించేందుకు తగిన ప్రణాళికలను బ్లాక్‌ బెర్రీ వెల్లడించింది. ఈ ఏడాది చివరికల్లా హైదరాబాద్‌ ఫెసిలిటీ... కెనడా తరువాత అంతర్జాతీయంగా బ్లాక్‌బెర్రీ యొక్క ఐఓటీ డివిజన్‌లలో రెండవ అతిపెద్ద కేంద్రంగా నిలువనుందని ప్రకటించింది. ఇక్కడ 100మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు విస్తృత శ్రేణి సాంకేతిక స్థాయిలు మరియు నైపుణ్యాలతో పనిచేయనున్నారు. వీరిలో సీనియర్‌ మేనేజ్‌మెంట్‌, టెక్నికల్‌ ప్రాజెక్ట్‌మేనేజ్‌మెంట్‌, ప్రొడక్ట్‌ ఇంజినీరింగ్‌, క్లౌడ్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌, ఇంటిగ్రేషన్‌ మరియు సర్వీస్‌ డెలివరీ వంటివి ఉంటాయి.

బ్లాక్‌బెర్రీ ఐఓటీ ప్రెసిడెంట్‌ మత్తియాస్‌ ఎరిక్‌సన్‌ మాట్లాడుతూ ‘‘నైపుణ్యాలు మరియు ఆవిష్కరణలలో కొనసాగుతున్న బ్లాక్‌బెర్రీ యొక్క ప్రస్తుత పెట్టుబడులలో ఇవాళ మరో మైలురాయిని చేరుకున్నాము. ఇది ప్రపంచశ్రేణి సాఫ్ట్‌వేర్‌ ఇన్నోవేటర్లకు నిలయంగా ఇండియా యొక్క ప్రాధాన్యతను వెల్లడిస్తుంది. బ్లాక్‌బెర్రీ ఐఓటీ యొక్క అంతర్జాతీయ ఆవిష్కరణ నెట్‌వర్క్‌ను హైదరాబాద్‌లో విస్తరించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. ఇది వినియోగదారులు మరియు భాగస్వాములకు సేవలను అందించడంలో మా నిబద్ధతను వెల్లడించడంతో పాటుగా ఐఓటీ సాఫ్ట్‌వేర్‌ లీడర్‌గా మా వృద్ధిని మరింత వేగవంతం చేయనుంది. మరీ ముఖ్యంగా ఆటోమోటివ్‌ రంగంలో ఈ వృద్ధి ని వేగవంతం చేయనుంది’’ అని అన్నారు.

‘‘ఆటోమోటివ్‌ మరియు ఐఓటీ రంగాల్లోని స్ధానిక మరియు అంతర్జాతీయ తయారీదారులకు అత్యంత కీలకమైన మార్కెట్‌గా ఇండియా నిలుస్తుంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో ఉన్న ఇంజినీరింగ్‌ ప్రతిభావంతుల కారణంగా కీలకంగా నిలుస్తుంది. ఈ కేంద్రం, బ్లాక్‌బెర్రీ ఐఓటీ , భారతదేశంలో మా వినియోగదారులు మరియు భాగస్వాములతో అతి సన్నిహితంగా సహ అభివృద్ధి మరియు సహ ఆవిష్కరణలు చేసేందుకు బ్లాక్‌బెర్రీకి తోడ్పడనుంది. ఇక్కడ ఉన్న ప్రతిభావంతులైన డెవలపర్లు మరియు ఇంజినీర్లకు ఆటోమోటివ్‌ మరియు ఇతర ఎంబీడెడ్‌ పరిశ్రమల కు అత్యంత క్లిష్టమైన సమస్యల కోసం అత్యుత్తమ పరిష్కారాలను నిర్మించే అవకాశం సైతం కల్పిస్తుంది’’ అని మతియాస్‌ ఎరిక్‌సన్‌ చెప్పుకొచ్చారు.