తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Protest In Metro Rail : కూకట్‌పల్లి టూ అమీర్‎పేట్.. మెట్రోలో భిక్షాటన చేస్తూ నిరసన

Protest In Metro Rail : కూకట్‌పల్లి టూ అమీర్‎పేట్.. మెట్రోలో భిక్షాటన చేస్తూ నిరసన

HT Telugu Desk HT Telugu

18 December 2022, 14:09 IST

    • Hyderabad Metro Rail : తెలంగాణలో నిరుద్యోగం పెరిగిపోయిందని మెట్రోలో బీజేపీ నేతలు నిరసన తెలిపారు. గ్రాడ్యుయేట్ల వేషధారణలతో భిక్షాటన చేశారు.
మెట్రో రైలులో నిరసన
మెట్రో రైలులో నిరసన (twitter)

మెట్రో రైలులో నిరసన

బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు అయినా నిరుద్యోగుల సమస్య అలాగే ఉందని, ఇంకా పెరిగిపోయిందని బీజేపీ(BJP) నేతలు, నిరుద్యోగులు విమర్శలు గుప్పించారు. బీజేపీ నేత విజిత్ వర్మ ఆధ్వర్యంలో హైదరాబాద్ మెట్రో రైలు(Hyderabad)లో గ్రాడ్యుయేట్ల వేషధారణలో నిరసన వ్యక్తం చేశారు. కూకట్ పల్లి నుంచి అమీర్ పేట వరకూ నిరసన తెలిపారు. తాము గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. ఉద్యోగాలు లేక తిరుగుతున్నామన్నారు.

ట్రెండింగ్ వార్తలు

TS ICET 2024 : నేటితో ముగియనున్న టీఎస్ ఐసెట్-2024 దరఖాస్తు గడువు

Army Recruitment Rally: సికింద్రాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ, పలు విభాగాల్లో అగ్నివీర్‌ ఎంపికలు

Hyderabad City Tour : హైదరాబాద్ సిటీ టూర్, వండర్ లా లో ఎంజాయ్- తెలంగాణ టూరిజం ప్యాకేజీ వివరాలివే!

Rythu Bharosa Funds : రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, రైతు భరోసా నిధులు విడుదల

కూకట్ పల్లి టూ అమీర్ పేట వరకూ.. మెట్రో రైలు(Metro Rail)లో పట్టభద్రుల మాదిరిగా దుస్తులు ధరించి.. భిక్షాటన చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. కూకట్ పల్లి టూ అమీర్‎పేట్ వరకు మెట్రో రైల్లో ప్రయాణిస్తూ భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన నిరుద్యోగులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

కేసీఆర్ ప్రభుత్వం(KCR Govt) అధికారంలోకి వచ్చాక నిరుద్యోగం తెలంగాణ(Telangana)లో బాగా పెరిగిపోయిందని నేతలు విమర్శించారు. నిరుద్యోగులను ఇలా భిక్షాటన చేసే స్థితికి కేసీఆర్ తీసుకొచ్చారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని కోరారు.

'మేం తెలంగాణలో నిరుద్యోగులం. కేసీఆర్ మమ్మల్ని అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చారు. దయచేసి మమ్మల్ని ఆదుకోండి. రాష్ట్రంలో ఏం జరుగుతుందో అందరూ తెలుసుకోవాలని నిరసన తెలుపుతున్నాం. నిరుద్యోగుల పరిస్థితి ఇలా కల్పించినందుకు బాధపడుతున్నాం. స్వయం ఉపాధి లేదు. లోన్స్ లేవు.. ఏం లేవు. ఎనిమిదేళ్లు అయినా.. ఏదీ లేదు. ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేద్దామంటే.. వయో పరిమితి అయిపోతుంది.' అని నేతలు తెలిపారు.