తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kavitha Phones Imei : కవిత చూపిన ఫోన్లు కొత్తగా కొన్నారా? బీజేపీ నేతలు ఏమంటున్నారు?

Kavitha Phones IMEI : కవిత చూపిన ఫోన్లు కొత్తగా కొన్నారా? బీజేపీ నేతలు ఏమంటున్నారు?

HT Telugu Desk HT Telugu

21 March 2023, 16:06 IST

google News
  • Kavitha Phones : దిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణ చేస్తోంది. అయితే విచారణకు వచ్చే ముందు ఆమె చూపించిన ఫోన్ల మీద బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

కవిత ఫోన్లు
కవిత ఫోన్లు (twitter)

కవిత ఫోన్లు

ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) ఈడీ విచారణ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆమె రెండోసారి విచారణకు హాజరయ్యారు. అయితే ఈడీ విచారణకు రావడం కంటే.. ముందుగా దిల్లీలోని తుగ్లక్ రోడ్డులోని ఇంటి నుంచి బయలుదేరే సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంటి ఎదుట ఉన్న మీడియాకు ఆమె మెుబైల్ ఫోన్లను(Kavitha Mobile Phones) చూపించారు. రెండు కవర్లను రెండు చేతులలో పట్టుకుని.. ప్రదర్శించారు.

దిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam)లో కవిత వాడిన ఫోన్లను పగలగొట్టారని.. ఆరోపణలు ఉన్నాయి. పది ఫోన్లు ధ్వంసం చేశారని వార్తలు వచ్చాయి. వాటికి సంబంధించిన ఫోన్లను ఆమె చూపించినట్టుగా తెలుస్తోంది. రెండు కవర్లలో ఫోన్లను తనతోపాటుగా ఈడీ వద్దకు తీసుకెళ్లారు. అయితే దీనిపై బీజేపీ నేతలు(BJP Leaders) విమర్శలు చేస్తున్నారు. కవిత చూపించిన ఫోన్లు పాతవి కాదు.. కొత్తవి అని ఆరోపిస్తున్నారు.

కవిత ఫోన్లు చూపించిన సమయంలోని ఫొటోలు, వీడియోలను బీజేపీ నేతలు జూమ్ చేసి చూశారు. వాటికి ఉన్న ఐఎంఈఐ నెంబర్ల(IMED Numbers)ను చూపించి.. ఫోన్లు ఎప్పుడు కొన్నారని ప్రశ్నిస్తున్నారు. ఒక ఫోన్ ఐ ఫోన్ ప్రో ఐఎంఈఐ నెంబర్ గా గుర్తించారు. ఈ ఫొన్ లాంచ్ అయింది.. 2022 సెప్టెంబర్ లో అని.. కొన్నది అక్టోబర్ లో అని.. ఈ ఫోన్ ఎవిడెన్స్ గా ఎలా ఇస్తున్నారని అడుగుతున్నారు. లిక్కర్ పాలసీ(Liquor Policey) ఆరోపణలు వచ్చాక.. జులైలో స్కామ్ బయటకొచ్చిందన్నారు. ఆ తర్వాత కొన్న ఫోన్లను ఈడీకి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.

ఈ విషయంపై బీజేపీ(BJP) నేతలు విమర్శలు చేస్తున్నారు. కవిత ఎవరిని ఫూల్ చేయాలని అనుకుంటున్నారని అడుగుతున్నారు. ఇంత తక్కువ కాలంలో అన్ని ఫోన్లను మార్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కవిత తనతోపాటుగా ఫోన్లను తీసుకెళ్లి ఈడీ అధికారులకు అందజేసినట్టుగా తెలుస్తోంది.

తదుపరి వ్యాసం