తెలుగు న్యూస్  /  Telangana  /  Ap And Telangana Telugu Live News Updates 16 November 2022
ఏపీ, తెలంగాణ తాజా వార్తలు
ఏపీ, తెలంగాణ తాజా వార్తలు

November 16 Telugu News Updates : మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట

16 November 2022, 23:08 IST

  • తెలంగాణ, ఏపీ వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి. తాజా వార్తల కోసం రిఫ్రెష్ చేస్తూ ఉండండి.

16 November 2022, 20:16 IST

ఏకాదశి పర్వదినం ఏర్పాట్లపై సమీక్ష

టీటీడీ స్థానికాలయాల్లో జనవరి 2న ఏకాదశి పర్వదినం ఏర్పాట్లపై జేఈవో వీరబ్రహ్మం పలు విభాగాల అధికారులతో వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించారు. ఆయా ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజులపాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని, ఆగమ పండితులు సూచించిన మేరకు ఖచ్చితమైన వేళలు పాటించాలని కోరారు. ఆలయాలను పుష్పాలు, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించాలన్నారు.

16 November 2022, 18:10 IST

మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట

మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట దొరికింది. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ మాస్టర్ ప్లాన్‌లో అవతవకలకు పాల్పడ్డారని ఆరోపణలతో నారాయణపై సీఐడి కేసు నమోదు చేసింది. అయితే కేసులో సాక్షిగా విచారణకు రావాలంటూ..నోటీసులు వచ్చాయి. వీటిపై నారయణ తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన అనారోగ్యంగా ఉన్నారని.. కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం.. హైదరాబాద్ లోని ఇంటి వద్ద విచారణ చేసుకోవచ్చని సీఐడీకి తెలిపింది.

16 November 2022, 16:48 IST

రాయచోటిలో మంత్రి జోగి రమేశ్​ పర్యటన

అన్నమయ్య జిల్లాలో మంత్రి జోగి రమేశ్ పర్యటించారు. జగనన్న లే అవుట్లను పరిశీలించారు. పర్యటనకు వచ్చిన మంత్రిని కలిసేందుకు అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధితులు వచ్చారు. మంత్రిని కలవకుండా పోలీసులు అడ్డుకున్నారు.

16 November 2022, 14:48 IST

ఇంజక్షన్ వికటించి విద్యార్థి మృతి

ఇంజక్షన్ వికటించి.. విదేశాలకు వెళ్లి చదవాల్సిన బండి విజయ్ మరణించాడు. ఆర్ఎంపీ వైద్యుడు వల్తే తమ కుమారుడు చనిపోయాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం జగన్నాధపురంలో జరిగింది.

16 November 2022, 12:31 IST

లింక్ రోడ్లు

ఆధునిక సాంకేతికతను ఉపయోగించి, భవిష్యత్ ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా.. ఆయా ప్రాంతాల ప్రజలకు సులభతర రవాణా సౌకర్యం కల్పించే దిశగా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది. ప్రధాన కారిడార్‌లపై ట్రాఫిక్ రద్దీ తగ్గించడమే లింక్ రోడ్ల ఉద్దేశం. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని, మొత్తం 126.20 కిలోమీటర్ల పొడవు కలిగిన 135 లింక్ రోడ్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతోపాటు ప్రయాణ సమయాన్ని ఆదా చేసే ప్రత్యామ్నాయ మార్గాలుగా ఈ లింక్ రోడ్లను నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించారు.

16 November 2022, 11:42 IST

నివాళులు

కృష్ణ భౌతిక కాయానికి సీఎం జగన్ నివాళులు అర్పించారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు.

16 November 2022, 10:59 IST

హైదరాబాద్ బయల్దేరి సీఎం జగన్

తాడేపల్లి నుంచి హైదరాబాద్ బయల్దేరారు సీఎం జగన్. కాసేపట్లో కృష్ట పార్థివదేహానికి నివాళులర్పించారు.

16 November 2022, 10:10 IST

అరుదైన చేప… 

ఒడిశాలోని బాలాసోర్‌లో అరుదైన చేప దొరికింది. 500 కిలోల ఉన్న ఆ చేపను చూసిన జాలర్లు ఆశ్చర్యపోయారు. ఆ చేప లక్ష రూపాయలకు అమ్ముడుపోయింది. ఆ చేపలో ఔషద గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే అప్పుడప్పుడు మత్స్యకారులకు ఇలాంటి అత్యంత అరుదైన చేపలు, సముద్ర జీవులు చిక్కుతున్నాయి. ఈ అరుదైన చేపను ఒత్తిడి నివారణ మందుల తయారీకి వినియోగిస్తారని అసిస్టెంట్ ఫిషరీస్‌ ఆఫీసర్‌ పార్థసారధి స్వెయిన్‌ వెల్లడించారు. కాగా అప్పుడప్పుడు దొరుకుతున్న ఇలాంటి చేపల వల్ల మత్స్యకారులకు కాసులు పంట పడుతుంది. #

16 November 2022, 7:52 IST

హైదరాబాద్ కు సీఎం జగన్

సూపర్‌ స్టార్‌ కృష్ణకు నివాళి అర్పించేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో ఆయన తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరనున్నారు. హైదరాబాద్‌ పద్మాలయా స్టూడియోస్‌కు చేరుకుని.. సూపర్‌స్టార్‌ కృష్ణ పార్థివ దేహానికి ఆయన నివాళులర్పించనున్నారు. 

16 November 2022, 7:50 IST

ఘోర రోడ్డు ప్రమాదం…

ఏపీలోని కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గండేపల్లి మండలం మల్లేపల్లి వద్ద ఆగి ఉన్న లారీని టాటా మ్యాజిక్ వాహనం ఢీకొట్టింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో... నలుగురు దుర్మరం చెందారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

16 November 2022, 6:59 IST

నేడు అంత్యక్రియలు

సూపర్‌ స్టార్‌ కృష్ణ అంత్యక్రియలు ఇవాళ నిర్వహించనున్నారు. కృష్ణ భౌతికకాయానికి బుధవారం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. కృష్ణ భౌతికకాయాన్ని మొదట గచ్చిబౌలిలోని ఆస్పత్రి నుంచి నానక్ రామ్‌గూడలోని ఆయన నివాసానికి తరలించారు. కృష్ణ పార్థివదేహానికి.. పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు.

16 November 2022, 6:36 IST

సింగిల్‌ జడ్జి పర్యవేక్షణలో సిట్‌ దర్యాప్తు

మ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఈ కేసును దర్యాప్తు చేయొచ్చని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. అయితే దర్యాప్తు మొత్తం హైకోర్టు సింగిల్‌ జడ్జి (జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి) పర్యవేక్షణలో కొనసాగాలని ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ ఆదేశాలు జారీ చేసింది.

16 November 2022, 6:37 IST

5 ప్రశ్నలు డిలీట్… 

గ్రూప్‌-1 ప్రాథమిక పరీక్షలో వచ్చిన అభ్యంతరాలపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు ప్రశ్నలను పూర్తిగా తొలగించాలని నిర్ణయించింది. మొత్తం 150 ప్రశ్నల్లో 145 ప్రశ్నలనే పరిగణనలోకి తీసుకోనుంది. ప్రాథమిక ‘కీ’పై వచ్చిన అభ్యంతరాలు, పరిశీలన అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది.

    ఆర్టికల్ షేర్ చేయండి