తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Air India Flights: ఎయిర్ ఇండియా విమానాల రద్దు.. ప్రయాణికులకు ఇబ్బందులు

Air India Flights: ఎయిర్ ఇండియా విమానాల రద్దు.. ప్రయాణికులకు ఇబ్బందులు

HT Telugu Desk HT Telugu

10 April 2023, 9:19 IST

google News
    • Air India Flights: శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి దేశంలో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన డొమెస్టిక్ విమానాలను ముందస్తు సమాచారం లేకుండా రద్దు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. విమానాల నిర్వహణలో భాగంగా సర్వీసులు రద్దు చేసినట్లు సంస్థ ప్రకటించింది. 
ఎయిర్ ఇండియా విమానాల రద్దుతో ప్రయాణికుల ఇబ్బందులు
ఎయిర్ ఇండియా విమానాల రద్దుతో ప్రయాణికుల ఇబ్బందులు

ఎయిర్ ఇండియా విమానాల రద్దుతో ప్రయాణికుల ఇబ్బందులు

Air India Flights: శంషాబాద్ విమనాశ్రయం నుంచి దేశంలోని పలు నగరాలకు వెళ్లాల్సిన డొమెస్టిక్ విమానాలను ముందస్తు సమాచారం లేకుండా రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఒకే రోజు పలు ఎయిర్ ఇండియా విమానాలు రద్దు అయ్యారు. మెయింటెయినెన్స్‌లో భాగంగా 8 దేశీయ విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది.

తిరుపతి ,బెంగళూరు, మైసూర్, హైదరాబాద్ విమానాల రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముందస్తు సమాచారం లేకుండా రద్దు చేయడంతో ప్రయాణికుల ఆందోళనకు దిగారు. సాంకేతిక కారణాలతో రద్దు చేశామని ఎయిర్ ఇండియా ప్రకటించింది,.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి వివిధ ప్రాంతాలకు బయలుదేరాల్సిన అలయన్స్ ఎయిర్ లైన్స్ కు చెందిన 4 ఫ్లైట్స్, అలాగే ఇతర ప్రాంతాల నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రావల్సిన 4 ఫ్లైట్స్ రద్దు చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన హైదరాబాద్ - తిరుపతి, హైదరాబాద్ - బెంగుళూరు, హైదరాబాద్‌ - విజయవాడ, హైదరాబాద్ - మైసూరు విమానాలను రద్దు చేశారు.

విమానాల రద్దు సమాచారం ప్రయాణికులకు చెప్పకపోవడంతో ప్రయాణికులు ఎయిర్ ఇండియా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ప్రయాణికుల ఆందోళనతో ఎయిర్‌ ఇండియా సిబ్బంది టిక్కెట్ ధరను వాపసు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

ఇతర ప్రాంతాల నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రావాల్సిన 4 సర్వీసులు కూడా రద్దు చూశారు. వీటిలో చెన్నై నుంచి హైదరాబాద్‌ రావాల్సిన విమానం, తిరుపతి నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానం, బెంగుళూరు నుంచి శంషాబాద్ రావాల్సిన విమానం, మైసూరు నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానం ఉన్నాయి.

రద్దైన విమానాల వివరాలు….

9I 877 HYD TO TIR,

6.10am

9I 895 HYD TO BLR,

7.25am

9I 888 HYD TO VGA,

8.15am

9I 847 HYD TO MYQ,

10.55am (mysure)

9I 872 MAA TO HYD,

23.35 (09.04.23 Chennai Intel)

9I 878 TIR TO HYD,

9.30am

9I 896 BLR TO HYD,

11.15am

9I 848 MYQ TO HYD,

15.05pm

తదుపరి వ్యాసం