తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sonu Sood : కరీంనగర్ బాలుడికి సోనూ సూద్ సాయం

Sonu Sood : కరీంనగర్ బాలుడికి సోనూ సూద్ సాయం

HT Telugu Desk HT Telugu

20 July 2022, 18:00 IST

    • నటుడు సోనూసూద్ మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. కరీంనగర్ జిల్లాకు చెందిన బాలుడికి సాయం చేశాడు.
బాలుడికి సోనూ సూద్ సాయం
బాలుడికి సోనూ సూద్ సాయం

బాలుడికి సోనూ సూద్ సాయం

సినిమాల్లో విలన్ వేషాలు వేస్తూ.. నిజ జీవితంలో ఎందరికో సాయం చేస్తూ రియల్ హీరోగా నిలుస్తున్నారు నటుడు సోనూసూద్. కొవిడ్ సమయంలో ఎందరికో అండగా నిలిచారు. లాక్‌డౌన్లో ఇబ్బందిపడిన లక్షలాది మందిని సొంత ఊళ్లకు చేర్చారు. సాయం అడిగితే.. కాదు.. లేదు అనకుండా చేశారు. ఇంకా తన సేవను కొనసాగిస్తూనే ఉన్నారు. చాలామందికి ఆపద్బాంధవుడిలా ఉన్నారు. ప్రాంతం, భాష దాటి సోనూ సూద్ సేవలు ఉన్నాయి. తాజాగా కరీంనగర్ బాలుడికి సాయం చేశాడు ఈ ఉత్తమ విలన్.

ట్రెండింగ్ వార్తలు

Siddipet : సిద్దిపేటలో విషాదం, వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

Peddapalli Tractor Accident : పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం, ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి

TS AP Rains : తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు, రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు-పిడుగుపాటు హెచ్చరికలు జారీ

Hyderabad Pub : యువతులతో అసభ్యకర డ్యాన్సులు, ఆఫ్టర్ 9 పబ్ పై పోలీసుల దాడులు

కరీంనగర్‌కు చెందిన ఏడు నెలల మహ్మద్ సఫాన్ అలీకి కాలేయ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించడంలో సహాయం చేశాడు సోనూ సూద్. కేరళలోని కొచ్చిలోని ఆస్టర్ మెడ్‌సిటీ ఆసుపత్రిలో ఈ చికిత్స జరిగింది. సోనూ సూద్‌తో కలిసి ఆస్టర్ వాలంటీర్లు ప్రారంభించిన సెకండ్ ఛాన్స్ ఇనిషియేటివ్ కోసం.. చికిత్స తీసుకున్న మొదటివాడు సఫాన్ అలీ అనే బాలుడు.

సఫాన్ అలీకి నాలుగు నెలల వయస్సు ఉన్నప్పుడు కొచ్చిలోని ఆస్టర్‌కు తీసుకువచ్చారు. వైద్య పరిభాషలో చెప్పాలంటే బిలియరీ అట్రేసియా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధితో కాలేయంపై తీవ్రస్థాయిలో ప్రభావం పడుతుంది. తెలంగాణలోని వివిధ ఆసుపత్రులకు తీసుకెళ్లారు తల్లిదండ్రులు. కానీ శస్త్రచికిత్స విఫలమైంది. ఆ తర్వాత బాలుడికి కామెర్లు, సిర్రోసిస్‌ ఉంది. దీనికి కాలేయ మార్పిడి అవసరం. సోనూ సూద్ సహాయంతో రోగి కొచ్చిలోని ఆస్టర్ మెడ్‌సిటీకిలో కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స చేశారు.

'వైద్యంలో భారతదేశం భారీ ప్రగతిని సాధించింది. సఫాన్ అలీ, అతని కుటుంబ సభ్యులలాంటి వారికి వైద్యం ఇంకా చాలా దూరంలోనే ఉంది. చాలా ఎక్కువ ఖర్చు కారణంగా.. సెకండ్ ఛాన్స్ చొరవతో వైద్యం చేయించాం. సఫాన్ అలీ ఆరోగ్యంగా ఉండాలి.' అని నటుడు సోనూసూద్ అన్నారు.