తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Black Magic: మంచి చేస్తానంటూ కాళ్లను నిప్పుల్లో పెట్టిన బాబా.. యువతికి సీరియస్

Black Magic: మంచి చేస్తానంటూ కాళ్లను నిప్పుల్లో పెట్టిన బాబా.. యువతికి సీరియస్

HT Telugu Desk HT Telugu

19 May 2022, 11:02 IST

    • వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలో దారుణం వెలుగు చూసింది. దొంగ బాబా నిర్వాకంతో యువతి తీవ్రంగా గాయపడింది. బుధవారం రాత్రి దొంగ బాబాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మంచి జరుగుతుందంటూ యువతి కాళ్లు, చేతులను నిప్పులపై పెట్టిన బాబా
మంచి జరుగుతుందంటూ యువతి కాళ్లు, చేతులను నిప్పులపై పెట్టిన బాబా

మంచి జరుగుతుందంటూ యువతి కాళ్లు, చేతులను నిప్పులపై పెట్టిన బాబా

వైద్యమన్నాడు... తాను డీల్ చేస్తే రోగం మటుమాయం అన్నాడు. ఈ దొంగ బాబా మాటలను నమ్మిన ఓ తల్లి తన బిడ్డను అతగాడి చేతిలో పెట్టింది. సీన్ కట్ చేస్తే ఆ యువతి పరిస్థితి సీరియస్ గా ఉంది. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో వెలుగు చూసింది.

ట్రెండింగ్ వార్తలు

Leopard in Medak : మెదక్ జిల్లాలో చిరుత సంచారం...! అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

TS TET Exams 2024 : తెలంగాణ టెట్ పరీక్షల షెడ్యూల్ విడుదల - స్వల్ప మార్పులు, ఏ పరీక్ష ఎప్పుడంటే..?

Goa Tour Package : బడ్జెట్ ధరలోనే 4 రోజుల గోవా ట్రిప్... ఎన్నో బీచ్‌లు, క్రూజ్ బోట్ లో జర్నీ - ప్యాకేజీ వివరాలివే

TSRTC Ticket Reservation : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ - రిజర్వేషన్ ఛార్జీల మినహాయింపుపై ప్రకటన

ఏం జరిగిందంటే...

ధారూర్ మండల పరిధికి చెందిన దంపతులకు కుమార్తె ఉంది. ఆమెకు అనారోగ్యంగా ఉండటంతో పరిగి మండలం నస్కల్‌ గ్రామ శివారులోని దర్గాలో ఉండే బాబా రఫీక్‌ దగ్గరికి తీసుకెళ్లారు. అమ్మాయికి గాలి సోకిందని.. బాగు చేస్తానని బాబా నమ్మించాడు. మంచి జరుగుతుందంటూ యువతి కాళ్లు, చేతులను నిప్పులపై పెట్టించాడు. మంటలకు యువతి కాళ్లు దారుణంగా కాలి పోయాయి. అయితే తీరా అంతా జరిగాక.. చేసేది ఏం లేదన్నారు. ఇక నేనేం చేయలేనంటూ చేతులెత్తేశాడు. దీంతో దిక్కుతోచనిస్థితిలోని ఆ తల్లిదండ్రులు.. వికారాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటన స్థానిక పోలీసుల దృష్టికి వెళ్లటంతో రంగంలోకి దిగారు. ఆస్పత్రిలో యువతి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బుధవారం రాత్రి నకిలీ బాబా రఫీని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. మరోవైపు మాయమాటలతో బాబా రఫీ ప్రజలను మోసం చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాబాల మాటల నమ్మవద్దని.. ప్రాణాలకు మీదకు తెచ్చుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. 

 

టాపిక్