తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Wtc Final : ఆస్ట్రేలియా జట్టుకు అతడి ఆట చాలా కీలకం.. ఆసీస్ ప్రధాన కోచ్

WTC Final : ఆస్ట్రేలియా జట్టుకు అతడి ఆట చాలా కీలకం.. ఆసీస్ ప్రధాన కోచ్

Anand Sai HT Telugu

25 May 2023, 8:45 IST

google News
    • WTC Final : ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌ కోసం అంతా సిద్ధమైంది. మరికొన్ని రోజుల్లో పోరు జరగనుంది. అయితే ఈ సందర్భంగా ఆసీస్ ప్రధాన్ కోచ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఆసీస్ జట్టు
ఆసీస్ జట్టు

ఆసీస్ జట్టు

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. టెస్ట్ క్రికెట్‌లో అగ్రస్థానంలో ఉన్న భారత్, ఆస్ట్రేలియా టెస్ట్ ఫార్మాట్‌లో ఛాంపియన్ జట్టు కోసం పోరాడుతాయి. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ జరుగుతోంది. ఈ టోర్నమెంట్‌లో ఎక్కువ మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. అయితే ఐపీఎల్ పూర్తి చేసిన ఆటగాళ్లు ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ కోసం సన్నాహాలు ప్రారంభించారు. విరాట్ కోహ్లి, కోచ్ ద్రవిడ్, సహాయక సిబ్బందితో సహా 7 మంది భారత ఆటగాళ్లు ఇప్పటికే ఇంగ్లాండ్‌కు బయలుదేరారు.

ఈ ప్రతిష్టాత్మక సిరీస్ ప్రారంభానికి ముందు, ఆస్ట్రేలియా జట్టు ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ మాట్లాడుతూ జట్టులోని ఒక ఆటగాడి గురించి ప్రత్యేక అంచనాలను వ్యక్తం చేశాడు. ఆ ఆటగాడు మరెవరో కాదు.. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్. అద్భుత ఫామ్‌లో ఉన్న వార్నర్.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆఖరి మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించనున్నాడు.

ఈ ఐపీఎల్ టోర్నీలో డేవిడ్ వార్నర్ అద్భుతమైన ప్రదర్శన కనపరిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన వార్నర్ దూకుడు ప్రదర్శన చూపాడు. టోర్నీలో మొత్తం జట్టు విఫలమైనప్పటికీ, వార్నర్ దాదాపు ఒంటరి పోరాటాన్ని ప్రదర్శించాడు. 14 మ్యాచ్‌లు ఆడి 516 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో అతని అత్యధిక స్కోరు 86 పరుగులు.

డేవిడ్ వార్నర్‌పై చాలా ఆశాజనకంగా ఉన్నామని.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్, యాషెస్ సిరీస్‌ల ఫైనల్లో అతను పెద్ద పాత్ర పోషిస్తాడనే నమ్మకంతో అతడిని జట్టులోకి ఎంపిక చేశామని ఆస్ట్రేలియా జట్టు కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ తెలిపారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్, యాషెస్ టెస్ట్ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌ల కోసం డేవిడ్ వార్నర్‌కు జట్టులో స్థానం లభించింది. వార్నర్‌తో పాటు, మార్జ్ హారిస్, మాట్ రెన్‌షా కూడా ఎంపిక అయ్యారు.

భారత జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, ఇషాన్ ఉనద్కత్ కిషన్ (వికెట్ కీపర్).

ఆస్ట్రేలియా జట్టు

పాట్ కమిన్స్ (కెప్టెన్), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, నాథన్ లియాన్, మిచ్ మార్ష్, టాడ్ మర్ఫీ, మాథ్యూ రెన్‌షా, స్టీవ్ స్మి, స్టీవ్ స్మి , డేవిడ్ వార్నర్.

తదుపరి వ్యాసం