David Warner: ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన ఐదో కెప్టెన్ డేవిడ్ వార్నర్
David Warner: ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన ఐదో కెప్టెన్ గా డేవిడ్ వార్నర్ నిలిచాడు. మంగళవారం (ఏప్రిల్ 11) ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో వార్నర్ ఈ ఘనత సాధించాడు.
David Warner: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్లో మరో రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మెగా లీగ్ లో కెప్టెన్ గా 3000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి విదేశీ కెప్టెన్ గా వార్నర్ నిలిచాడు. మంగళవారం (ఏప్రిల్ 11) ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో వార్నర్ ఈ ఘనత సాధించాడు. ఓవరాల్ గా ఐపీఎల్లో ఈ రికార్డును సొంతం చేసుకున్న ఐదో కెప్టెన్ వార్నర్.
ఈ మధ్యే అతడు ఐపీఎల్లో అత్యంత వేగంగా 6 వేల పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచిన విషయం తెలిసిందే. సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ గా ఉన్న సమయంలోనే వార్నర తన విశ్వరూపం చూపించాడు. ఇక ఐపీఎల్లో కెప్టెన్ గా 3 వేలకుపైగా రన్స్ చేసిన కెప్టెన్లు వార్నర్ కంటే ముందు నలుగురు ఉన్నారు. వాళ్లంతా ఇండియన్ కెప్టెన్లే.
వీళ్లలో ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి 4881 రన్స్ తో ముందున్నాడు. అతని తర్వాత చెన్నై సూపర్ కింగ్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ కెప్టెన్ గా ధోనీ 4582 రన్స్ చేశాడు. ఐపీఎల్లో కెప్టెన్ గా 4 వేలకుపైగా రన్స్ చేసింది ఈ ఇద్దరు మాత్రమే. ఇక 3 వేలకుపైగా రన్స్ చేసిన కెప్టెన్లలో రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ కూడా వార్నర్ కంటే ముందున్నారు.
ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో వార్నర్ తన రెండో పరుగు తీయగానే ఈ క్లబ్ లో చేరాడు. ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన తొలి మూడు మ్యాచ్ లలోనూ ఓడినా.. వార్నర్ మాత్రం బ్యాట్ తో రాణిస్తున్నాడు. ముంబైతో మ్యాచ్ లోనూ అతడు హాఫ్ సెంచరీ చేయడం విశేషం. అయితే తన మునుపటి రీతిలో కాకుండా ఈ మధ్య వార్నర్ స్ట్రైక్ రేట్ దారుణంగా పడిపోవడంపై విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
సంబంధిత కథనం