తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl Captains: ఐపీఎల్ ట్రోఫీతో కెప్టెన్ల పోజులు.. సన్‌రైజర్స్ కెప్టెన్‌గా భువనేశ్వర్.. కనిపించని రోహిత్

IPL Captains: ఐపీఎల్ ట్రోఫీతో కెప్టెన్ల పోజులు.. సన్‌రైజర్స్ కెప్టెన్‌గా భువనేశ్వర్.. కనిపించని రోహిత్

Hari Prasad S HT Telugu

30 March 2023, 18:52 IST

  • IPL Captains: ఐపీఎల్ ట్రోఫీతో కెప్టెన్లు పోజులిచ్చారు. అయితే సన్‌రైజర్స్ కెప్టెన్‌గా భువనేశ్వర్ కనిపించాడు. తొలి మ్యాచ్ కు మాత్రమే భువీ టీమ్ కెప్టెన్ గా ఉండనున్నాడు.

ఐపీఎల్ ట్రోఫీతో పది జట్ల కెప్టెన్లు
ఐపీఎల్ ట్రోఫీతో పది జట్ల కెప్టెన్లు

ఐపీఎల్ ట్రోఫీతో పది జట్ల కెప్టెన్లు

IPL Captains: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ శుక్రవారం (మార్చి 31) నుంచి ప్రారంభం కానుంది. ఇక క్రికెట్ లవర్స్ కు రెండు నెలల పాటు పండగే. ఈ మెగా లీగ్ ప్రారంభానికి ఒక రోజు ముందు తొమ్మిది జట్ల కెప్టెన్లు ఐపీఎల్ ట్రోఫీతో కెమెరాకు పోజులిచ్చారు. అయితే ఇందులో సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఏడెన్ మార్‌క్రమ్ స్థానంలో భువనేశ్వర్ ఉన్నాడు. ఇక ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కనిపించలేదు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

సీజన్ తొలి మ్యాచ్ కు మార్‌క్రమ్ అందుబాటులో లేకపోవడంతో భువీ కెప్టెన్ గా ఉండనున్నాడు. ఐపీఎల్ అధికారిక ట్విటర్ అకౌంట్ ఈ ఫొటోను పోస్ట్ చేసింది. ఇందులో మిగతా 8 జట్ల కెప్టెన్లతో భువనేశ్వర్ ఉండటం చూడొచ్చు. తొమ్మిది జట్ల కెప్టెన్లు కలిసి ఈ సీజన్ ట్రోఫీని ఆవిష్కరించారు. మార్‌క్రమ్ ప్రస్తుతం సౌతాఫ్రికాలోనే ఉన్నాడు. అక్కడ నెదర్లాండ్స్ తో రెండు వన్డేల సిరీస్ ఆడుతున్నాడు.

వచ్చే ఆదివారం (ఏప్రిల్ 2) హైదరాబాద్ తన తొలి మ్యాచ్ ఆడనుండగా.. మార్‌క్రమ్ ఏప్రిల్ 3న జట్టుతో చేరనున్నాడు. భువనేశ్వర్ ఇంతకుముందు 2019లో ఆరు మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించాడు. గతేడాది కూడా ఒక మ్యాచ్ లో కెప్టెన్ గా ఉన్నాడు. ఇప్పుడు భువీ కెప్టెన్సీలో తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది.

శుక్రవారం (మార్చి 31) నుంచి ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్, మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఆ స్టేడియంలోనే జట్ల కెప్టెన్లు ఐపీఎల్ ట్రోఫీని ఆవిష్కరించారు.

ఇందులో గుజరాత్, చెన్నై కెప్టెన్లు హార్దిక్ పాండ్యా, ధోనీతోపాటు ఢిల్లీ కెప్టెన్ వార్నర్, కోల్‌కతా కెప్టెన్ నితీష్ రాణా, రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్, లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్, సన్ రైజర్స్ కెప్టెన్ భువనేశ్వర్, బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెస్సి, పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఉన్నారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం కనిపించలేదు.