తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Virat Kohli Fined Amount : ఆటగాళ్లకు ఇచ్చేదానికంటే ఎక్కువ ఫైన్స్ కట్టిన కింగ్ కోహ్లీ

Virat Kohli Fined Amount : ఆటగాళ్లకు ఇచ్చేదానికంటే ఎక్కువ ఫైన్స్ కట్టిన కింగ్ కోహ్లీ

Anand Sai HT Telugu

03 May 2023, 7:24 IST

google News
    • IPL 2023 Kohli Vs Gambhir : లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్-విరాట్ కోహ్లీ మధ్య జరిగిన గొడవపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని జరిమానా కూడా విధించారు. అయితే ఈ ఐపీఎల్ లో కోహ్లీకి మూడు సార్లు ఫైన్ వేశారు.
విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ (RCB Twitter)

విరాట్ కోహ్లీ

ఈ ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ(IPL Virat Kohli) అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. కింగ్ కోహ్లీ(King Kohli) ఆడిన 9 మ్యాచ్‌ల్లో 364 పరుగులు చేశాడు. ఈసారి 5 అర్ధ సెంచరీలు కూడా చేశాడు. విశేషమేమిటంటే ఈ 9 మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ 3 సార్లు ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని(IPL Code Of Conduct) ఉల్లంఘించాడు. మూడుసార్లు జరిమానా కూడా చెల్లించాడు.

ఏప్రిల్ 17న చెన్నై సూపర్ కింగ్స్‌తో(Chennai Super Kings) జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు. ఈ రకమైన వేడుకలు IPL ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం లెవల్ 1 నేరం. కాబట్టి విరాట్ కోహ్లీకి 12 లక్షలు జరిమానా విధించారు.

దీని తర్వాత, ఏప్రిల్ 23 న జరిగిన రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ స్లో ఓవర్ రేట్‌కు శిక్ష అనుభవించాడు. ఈ మ్యాచ్‌లో తాత్కాలిక కెప్టెన్‌గా కనిపించిన విరాట్ కోహ్లీ నిర్ణీత సమయంలోగా 20 ఓవర్లు పూర్తి చేయలేదు. ఐపీఎల్ కనీస ఓవర్ రేట్ నేరాల కింద కింగ్ కోహ్లీకి 24 లక్షలు జరిమానా విధించారు.

ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్‌తో(lucknow super giants) జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళికి సంబంధించిన లెవల్-2 ఉల్లంఘనకు విరాట్ కోహ్లీకి మ్యాచ్‌లో 100 శాతం జరిమానా పడింది. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్‌(Gautham Gambhir)తో కోహ్లికి మైదానంలో వాగ్వాదం జరిగింది. ఈ తప్పిదానికి కోహ్లీకి 1.07 కోట్లు జరిమానా విధించారు.

అంటే ఈసారి ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ మొత్తం 1 కోటి 43 లక్షలు జరిమానాగా చెల్లించాడు. ఆశ్చర్యకరంగా ఇది RCB జట్టులోని కొంతమంది ఆటగాళ్లకు లభించే దానికంటే ఎక్కువ. RCB ఆటగాళ్లు మహిపాల్ లోమ్రార్ (రూ. 95 లక్షలు), సుయాష్ ప్రభుదేశాయ్ (రూ.30 లక్షలు), కర్ణ్ శర్మ (రూ.50 లక్షలు), ఫిన్ అలెన్ (రూ.80 లక్షలు), సిద్ధార్థ్ కౌల్ (రూ.75 లక్షలు). విరాట్ కోహ్లీకి ప్రధాన ఆటగాళ్లకు ఇచ్చే దానికంటే ఎక్కువ చెల్లించడం విశేషం.

తదుపరి వ్యాసం