CSK vs PBKS | టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. బౌలింగ్ చేస్తామన్న జడేజా
ఐపీఎల్ 2022 సీజన్ సెకండాఫ్‌లో అయినా మెరుగ్గా ఆడాలని ఇటు చెన్నై, అటు పంజాబ్ భావిస్తున్నాయి. అయితే గత మ్యాచ్‌లో ముంబైపై పాత ధోనీని గుర్తు చేస్తూ అతడు ఆడిన ఇన్నింగ్స్‌తో చెన్నై ఆత్మవిశ్వాసం రెట్టింపైంది.
ముంబై: పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ఆదివారం ముంబై, లక్నో మ్యాచ్ జరిగిన వాంఖెడె స్టేడియంలోనే ఈ మ్యాచ్ జరుగుతోంది. గత మ్యాచ్ ఆడిన టీమ్ తోనే చెన్నై బరిలోకి దిగుతోంది. పంజాబ్ మాత్రం మూడు మార్పులు చేసింది.
పాయింట్ల టేబుల్లో పంజాబ్, చెన్నై టీమ్స్ వరుసగా 8, 9 స్థానాల్లో ఉన్నాయి. ఈ సీజన్‌లో తొలిసారి తలపడినప్పుడు చెన్నైని పంజాబ్ చిత్తు చేసింది. గత ఐదు మ్యాచ్‌లలో ఈ రెండు టీమ్స్ ఫామ్ ఒకేలా ఉంది. మూడు గెలిచి, రెండింట్లో ఓడాయి. తమ చివరి మ్యాచ్‌లో ధోనీ కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌తో ముంబైపై గెలిచిన చెన్నై అదే ఊపులో ఈ మ్యాచ్ గెలవాలని చూస్తోంది.
అటు పంజాబ్ మాత్రం వరుసగా సన్‌రైజర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చేతుల్లో ఓడి ఒత్తిడిలో ఉంది. మ్యాచ్ జరగబోయే వాంఖెడె స్టేడియం ఈ సీజన్‌లో ఆసక్తికరమైన ఫలితాలు ఇచ్చింది. 8 మ్యాచ్‌లలో ముందు బ్యాటింగ్ చేసిన టీమ్ నాలుగుసార్లు, చేజింగ్ టీమ్ నాలుగుసార్లు గెలిచాయి.
టాపిక్