Bail for Chikoti Pravin: చీకోటి ప్రవీణ్‌కు షరతులతో కూడిన బెయిల్…జరిమానా చెల్లింపు-thailand court granted bail to chikoti praveen team ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bail For Chikoti Pravin: చీకోటి ప్రవీణ్‌కు షరతులతో కూడిన బెయిల్…జరిమానా చెల్లింపు

Bail for Chikoti Pravin: చీకోటి ప్రవీణ్‌కు షరతులతో కూడిన బెయిల్…జరిమానా చెల్లింపు

HT Telugu Desk HT Telugu

Bail for Chikoti Pravin: థాయ్‌లాండ్‌లో జూదమాడుతూ పట్టుబడిన చీకోటి ప్రవీణ్‌ బృందానికి థాయ్ న్యాయస్థానం షరతులతో కూడా బెయిల్ మంజూరు చేసింది.జరిమానా చెల్లించిన తర్వాత నిందితుల పాస్‌పోర్టులను అప్పగించారు.

థాయ్‌లాండ్ రైడ్స్‌లో పట్టుబడిన క్యాసినో కాయిన్స్

Bail for Chikoti Pravin: థాయ్‌ పోలీసుల దాడుల్లో అరెస్టైన చీకోటి ప్రవీణ్ బృందానికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. సోమవారం తెల్లవారు జామున థాయ్‌లాండ్ పోలీసులు జరిపిన దాడుల్లో చీకోటి ప్రవీణ్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన 83మందిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.

నిషేధిత ప్రావిన్స్‌లో జూద క్రీడలాడుతూ పట్టుబడిన వారికి స్థానిక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అరెస్టైన చీకోటి ప్రవీణ్‌ తాను ఆర్గనైజర్‌ కాదని, తన పేరు నిర్వహకుల్లో ఎక్కడ లేదని చెబుతున్నాడు. క్యాసినో నిర్వహించిన దేవ్, సీత ఆహ్వానం పంపితే తాను వెళ్లానని, 4 రోజులు ఫోకర్న్ టోర్నమెంట్ అని తనకు చెప్పారంటున్నాడు.

థాయ్‌లాండ్‌లో చట్టబద్దమైన టోర్నమెంట్ అని చెప్పడంతో వెళ్ళానని, ఈవెంట్ మొత్తం లీగల్ అని లేఖ పంపారని, వాటి ఆధారంగానే వెళ్లినట్లు చెబుతున్నాడు. థాయ్‌లాండ్‌లో గ్యాంబ్లింగ్ నిషేధం అని, ఫోకర్ ఇల్లీగల్ అనే సంగతి తెలియదన్నాడు. గ్యాంబ్లింగ్ జరుగుతున్న హాల్‌లోకి వెళ్లిన 10 నిమిషాలకే రైడ్ జరిగిందని, ఈ వ్యవహారంలో తన పాత్ర లేదని చెబుతున్నాడు. చీకోటి ప్రవీణ్‌తో పాటు 83మంది జరిమానా చెల్లించిన తర్వాత వారి పాస్‌పోర్టులను స్థానిక పోలీసులు అప్పగించారు.