ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli), లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ నవీన్-ఉల్-హక్‌లకు భారీ జరిమానా విధించారు. లక్నో, బెంగళూరు(LSGVsRCB) మధ్య మ్యాచ్ తర్వాత కోహ్లీ, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం(Kohli-Gambhir Conversation) చోటుచేసుకుంది. దీంతో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని(IPL Code Of Conduct) ఉల్లంఘించారంటూ.. ఓ ప్రకటన వచ్చింది. ఇందులో భారీ జరిమానా విధించినట్టుగా పేర్కొన్నారు.
'IPL ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.21 ప్రకారం లెవల్ 2 నేరాన్ని గంభీర్ అంగీకరించాడు. అతని మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా విధిస్తున్నాం. అదేవిధంగా కోహ్లీ IPL ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.21 ప్రకారం లెవల్ 2 నేరాన్ని అంగీకరించాడు. కోహ్లీ మ్యాచ్ ఫీజులో 100 శాతం జరిమానా విధించడం జరిగింది. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు నవీన్-ఉల్-హక్‌కు అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధిస్తున్నాం.' అని ఐపీఎల్ నుండి ఒక ప్రకటన వెలువడింది.
సోమవారం జరిగిన మ్యాచ్‌లో లక్నోపై బెంగళూరు(Bengaluru) టీమ్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. నిజానికి ఆర్సీబీ 127 పరుగుల స్పల్ప లక్ష్యాన్నే పెట్టింది. కానీ ఆ స్కోరును అద్భుతంగా డిఫెండ్ చేసుకుంది. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్ల షేక్ హ్యాండ్‌ల సమయంలో విరాట్ కోహ్లీ, లక్నో బౌలర్ నవీన్-ఉల్-హక్(naveen ul haq) మధ్య ఏదో విషయమై వివాదం మెుదలైంది. దీంతో గొడవ ప్రారంభమైంది. ఇద్దరూ చేతులు విసిరికొట్టుకున్నారు. అయితే ఈ వివాదంలోకి గౌతమ్ గంభీర్ వచ్చాడు.
దీంతో విరాట్ కోహ్లీ తీవ్రంగా రియాక్ట్ అయ్యాడు. కాసేపు వాగ్వాదం జరిగింది. ఇద్దరినీ విడిపించేందుకు ఇతర ఆటగాళ్లు ప్రయత్నించారు. కేఎల్ రాహుల్(KL Rahul), అమిత్ మిశ్రా వారిద్దరినీ విడిపించి దూరంగా తీసుకెళ్లడంతో సద్దుమణిగింది. అంతే కాకుండా పరిస్థితి చేయి దాటిపోవడంతో ఇరు జట్ల ఆటగాళ్లు మధ్యలోకి ప్రవేశించారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇప్పుడు విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్(Virat Kohli-Gautam Gambhir) మధ్య జరిగిన ఫైట్ వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది. ఈ ఘటన గురించి రాహుల్‌కు కోహ్లీ ఫిర్యాదు చేశాడు.
ఈ ఘటనపై బీసీసీఐ సీరియస్ అయింది. కోహ్లీ, గంభీర్‌లకు మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధించింది. అయితే ఏప్రిల్ 10న జరిగిన మ్యాచ్ తోనే ఈ గొడవ మెుదలైందని చర్చ ఉంది. ఆ రోజున లక్నో మ్యాచ్ గెలిచిన తర్వాత.. ఆర్సీబీ ఫ్యాన్స్ ను సైలెంట్ గా ఉండమని గంభీర్ సైగ చేశాడు. ఇదే విషయాన్ని కోహ్లీ మనసులో పెట్టుకున్నట్టుగా చర్చ నడుస్తోంది.