Lottery: బెంగళూరు వ్యక్తికి బంపర్ జాక్‍పాట్.. లాటరీలో రూ.44కోట్లు: అతడి ప్లాన్ ఏంటంటే!
Bengaluru Man Wins ₹44 Crore in Lottery: ఓ వ్యక్తికి బంపర్ ప్రైజ్ తగిలింది. ఆన్‍లైన్ లాటరీ ద్వారా ఏకంగా ఆయన సమారు రూ.44కోట్ల గెలుచుకున్నారు. పూర్తి వివరాలు ఇవే.
Bengaluru Man Wins ₹44 Crore in Lottery: బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తిని భారీ అదృష్టం వరించింది. ఒక్క రోజులోనే ఆయన కోటీశ్వరుడు అయిపోయారు. ఆన్‍లైన్‍లో కొనుగోలు చేసిన అబుదాబీ లాటరీ టికెట్(Abu Dhabi Lottery Ticket)తో ఏకంగా సుమారు రూ.44కోట్లు గెలుచుకున్నారు. బెంగళూరుకు చెందిన అరుణ్ కుమార్ వటక్కే కొరోత్ (Arun Kumar Vatakke Koroth) ఈ బంపర్ జాక్‍పాట్‍ను దక్కించుకున్నారు. అబుదాబీలో నిర్వహించిన బిగ్ టికెట్ డ్రా (Abu Dhabi Big Ticket Draw) సిరీస్ నంబర్ 250కు ఆ భారీ ప్రైజ్ దక్కింది. వివరాలివే..
మార్చి 22వ తేదీన బిగ్ టికెట్ డ్రా సిరీస్ 250లో 261031 టికెట్ నంబర్ లాటరీని అరుణ్ కుమార్ కొనుగోలు చేశారు. ఈ టికెట్‍కు తొలి బహుమతిగా ఆయన 20 మిలియన్ దిరామ్స్ (సుమారు రూ.44.75కోట్లు) గెలుచుకున్నారని గల్ఫ్ న్యూస్ రిపోర్ట్ చేసింది.
ప్రాంక్ కాల్ అనుకున్నాడట..
Bengaluru Man Wins ₹44 Crore in Lottery: లాటరీలో తన టికెట్‍కు బంపర్ ప్రైజ్ వచ్చిందని అరుణ్ కుమార్‍కు కాల్ వచ్చింది. బిగ్ టికెట్ లైవ్ డ్రా హోస్ట్ ఆయనకు కాల్ చేశారు. భారీ విజయానికి సంబంధించిన విషయం చెప్పారు. అయితే ముందు ఇది ప్రాంక్ కాల్ అని అనుకున్నారట అరుణ్ కుమార్. ఫోన్ కట్ చేసి, ఆ నంబర్‌ను బ్లాక్ కూడా చేశారట. అయితే మరో నంబర్ ద్వారా కాల్ చేసినప్పుడు నమ్మారట.
“బిగ్ టికెట్ నుంచి కాల్ వచ్చినప్పుడు నేను అది ఫేక్ అనుకున్నా. ఎవరైనా ప్రాంక్ చేస్తుండొచ్చని భావించా. కాల్ డిస్‍కనెక్ట్ చేసి, ఆ నంబర్‌ను బ్లాక్ చేశా. ఆ తర్వాత వేరే నంబర్ నుంచి నాకు కాల్ వచ్చింది” అని ఖలీజ్ టైమ్స్‌తో అరుణ్ కుమార్ చెప్పారు.
ఇంకా నమ్మలేకున్నా..
Bengaluru Man Wins ₹44 Crore in Lottery: తనకు ఇంత భారీ మొత్తం లాటరీలో వచ్చిందంటే ఇంకా నమ్మలేకున్నానని అరుణ్ కుమార్ చెప్పారు. “ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే నేను ఇంకా నమ్మలేకున్నా. బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆప్షన్‍లో నేను ఈ టికెట్ కొనుగోలు చేశా. ఇది నా మూడో టికెట్” అని అరుణ్ తెలిపారు.
నా ప్లాన్ అదే
Bengaluru Man Wins ₹44 Crore in Lottery: సొంతంగా వ్యాపారం చేయాలన్నది తన కల అని, ఆ డబ్బుతో దాన్ని సాకారం చేసుకుంటానని అరుణ్ కుమార్ చెప్పారు. లాటరీలో గెలిచిన డబ్బుతో బిజినెస్ ప్లాన్ చేస్తానని అన్నారు.
ప్రస్తుతం అరుణ్ కుమార్.. మోకాలి గాయంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ లాటరీలో బెహ్రయిన్‍లో నివసిస్తున్న భారతీయుడు సురేశ్ మాథన్‍కు రెండో బహుమతిగా సుమారు రూ.22లక్షలు అందాయని ఖలీజ్ టైమ్స్ రిపోర్ట్ చేసింది.