తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Dc Vs Rcb : దంచికొట్టిన సాల్ట్.. ఆర్సీబీపై దిల్లీ విజయం

DC vs RCB : దంచికొట్టిన సాల్ట్.. ఆర్సీబీపై దిల్లీ విజయం

HT Telugu Desk HT Telugu

07 May 2023, 5:39 IST

google News
    • DC vs RCB : బెంగళూరుపై దిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. దిల్లీ క్యాపిటల్స్ కు 181 పరుగుల లక్ష్యాన్ని పెట్టిన ఆర్సీబీ.. ఫీల్డింగ్‌లో విఫలమైంది. దీంతో 16.1 ఓవర్లలోనే దిల్లీ జట్టు విజయం సాధించింది.
సాల్ట్
సాల్ట్ (IPL)

సాల్ట్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal challengers Bangalore)పై దిల్లీ క్యాపిటల్స్ సులభంగా గెలిచింది. పోటాపోటీ లక్ష్యాన్ని అందించినప్పటికీ.. డిఫెన్స్‌లో పోరాడిన ఆర్‌సీబీ జట్టు(RCB Team) సాల్ట్ మెరుపుల ముందు ఓడిపోయింది. దీంతో డేవిడ్ వార్నర్ తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకున్నాడు.

తొలుత బ్యాటింగ్ చేసింది ఆర్సీబీ. విరాట్ కోహ్లీ(Virat Kohli), లోమ్రార్ హాఫ్ సెంచరీతో 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దిల్లీ.. ఫిలిప్ సాల్ట్ ఆటతో కేవలం 16.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ఛేజింగ్‌ను ప్రారంభించిన దిల్లీ మెుదటి నుంచి మెరుపులు మెరిపించింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(David Warner), ఫిలిప్ సాల్ట్ జట్టుకు శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 22 పరుగుల వద్ద కెప్టెన్ వార్నర్.. డుప్లెసిస్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అయితే ఆర్సీబీ బౌలర్లను సాల్ట్ సిక్సర్లతో ఇబ్బందిపెట్టాడు. 45 బంతులు ఎదుర్కొని 8 బౌండరీలు, 6 సిక్సర్లతో 87 పరుగులు చేశాడు.

వార్నర్ ఔటైన తర్వాత వచ్చిన మిచెల్ మార్ష్ కూడా సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. 17 బంతుల్లో 26 పరుగులు చేసిన తర్వాత క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. డెత్ ఓవర్లలో రోస్సో అద్భుతంగా రాణించి 22 బంతుల్లో 35 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. బెంగళూరు బౌలర్లలో హేజిల్‌వుడ్, కర్ణ్ శర్మ, హర్షల్ పటేల్ ఒక్కో వికెట్ పడగొట్టారు

తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ మంచి స్కోరునే నమోదు చేసింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ(Virat Kohli), ఫాఫ్ డుప్లెసిస్ ఈ మ్యాచ్‌లోనూ జట్టుకు శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (55; 46 బంతుల్లో 5 ఫోర్లు), మహిపాల్ లామ్రోర్ (54; 29 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), డుప్లెసిస్ (45; 32 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) బాగా ఆడారు. మ్యాక్స్‌వెల్ (0) నిరాశపరిచాడు. దినేశ్‌ కార్తిక్ (11) పరుగులు చేశాడు. దిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్‌ రెండు, ఖలీల్ అహ్మద్‌, ముఖేశ్ కుమార్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఈసారి విరాట్ కోహ్లి, మహిపాల్ లోమ్రార్ అర్ధ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. కాగా, హాఫ్ సెంచరీ చేసిన విరాట్ 55 పరుగులు చేసి ముఖేష్ కుమార్ చేతిలో ఔటయ్యాడు. లోమ్రార్‌ ఐపీఎల్‌లో తొలి అర్ధ సెంచరీని నమోదు చేశాడు. 29 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

డెత్ ఓవర్లలో కాసేపు బ్యాటింగ్ చేసిన దినేష్ కార్తీక్(Dinesh Karthik) 11 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో మూడు బంతులు ఎదుర్కొన్న అనుజ్ రావత్ ఒక సిక్సర్ సహా 8 పరుగులు చేశాడు. చివరకు ఆర్‌సీబీ 4 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది.

తదుపరి వ్యాసం