Dinesh Karthik on Rohit Sharma: తొలి రోజు రోహిత్ తీసుకున్న తప్పుడు నిర్ణయం అదే: దినేష్ కార్తీక్
Dinesh Karthik on Rohit Sharma: తొలి రోజు రోహిత్ తీసుకున్న తప్పుడు నిర్ణయం అదే అంటూ ఆట ముగిసిన తర్వాత వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నాలుగో టెస్టు తొలి రోజు ఆస్ట్రేలియా పైచేయి సాధించిన విషయం తెలిసిందే.
Dinesh Karthik on Rohit Sharma: ఇండియా టూర్ లో ఆస్ట్రేలియా క్రమంగా మెరుగవుతూ వస్తోంది. మూడో టెస్టు గెలిచి సిరీస్ లో కమ్‌బ్యాక్ చేసిన ఆ టీమ్.. నాలుగో టెస్టును కూడా ఘనంగా ఆరంభించింది. బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న పిచ్ పై తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 255 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా సెంచరీ చేశాడు.
తొలి రోజు తొలి గంట ఆస్ట్రేలియా డామినేట్ చేయగా.. ఆ తర్వాత నాలుగు వికెట్లు తీసి ఇండియా పుంజుకుంది. అయితే వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ తోపాటు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రకారం.. చివరి గంటలోనే కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన తప్పిదాలు టీమ్ కొంప ముంచాయి. ముఖ్యంగా కొత్త బంతి తీసుకోవాలన్న నిర్ణయాన్ని ఈ ఇద్దరూ తప్పుబట్టారు.
నిజానికి చాలా వరకూ రోహిత్ కెప్టెన్సీ బాగానే ఉన్నా.. చివర్లో తప్పు చేశాడని కార్తీక్ అన్నాడు. "రోహిత్ కెప్టెన్సీ చాలా వరకూ నాకు నచ్చింది. ఫీల్డ్ ప్లేసింగ్స్ బాగున్నాయి. సిల్లీ పాయింట్, షార్ట్ లెగ్ అంటూ సాంప్రదాయ ఫీల్డ్ సెట్ చేయలేదు. రోజు మొత్తంలో బ్యాట్ ప్యాడ్ కు బంతి తగిలిన సందర్భం లేదు. అతడు చాలా టైట్ ఫీల్డింగ్ సెట్ చేశాడు. తొలి గంట తర్వాత నాలుగు వికెట్లు తీశారు. స్మిత్, ఖవాజా ఆడే సమయంలోనూ వాళ్లకు సులువుగా బౌండరీలు ఇవ్వలేదు" అని కార్తీక్ అన్నాడు.
"కానీ ఆ సమయంలో కొత్త బంతి తీసుకోవాలన్నది సరైన నిర్ణయం కాదు. కొత్త బంతితో 9 ఓవర్లు అవసరమా? లేక 4-5 చాలా అన్నది ఆలోచించుకోవాల్సింది. అది మొదటిది. ఇక రెండోది.. రోహిత్ శర్మ కెప్టెన్సీలో అక్షర్ పటేల్ ఓ ఆసక్తికరమైన కేస్ స్టడీ. ఇండియన్ క్రికెట్లో రెండు ముఖ్యమైన స్తంభాలైన అశ్విన్, జడేజాలకే అతడు ఎక్కువ ఓవర్లు ఇస్తున్నాడు. కానీ అక్షర్ పటేల్ ఎక్కడ? కొత్త బంతితో అతడు బాగా బౌలింగ్ చేయగలడు. కొత్త బంతి తీసుకున్నప్పుడైనా అతనికి బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వాల్సింది. అతని సొంత మైదానం. బౌన్స్ కూడా చేయగలడు" అని కార్తీక్ అభిప్రాయపడ్డాడు.
సంబంధిత కథనం