Manjrekar on WTC Final: న్యూజిలాండ్‌ను ఓడించే సీన్ శ్రీలంకకు లేదు.. ఇండియానే డబ్ల్యూటీసీ ఫైనల్ వెళ్తుంది: మంజ్రేకర్-manjrekar on wtc final says india will reach to the final as sri lanka incappeble of upsetting new zealand ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Manjrekar On Wtc Final: న్యూజిలాండ్‌ను ఓడించే సీన్ శ్రీలంకకు లేదు.. ఇండియానే డబ్ల్యూటీసీ ఫైనల్ వెళ్తుంది: మంజ్రేకర్

Manjrekar on WTC Final: న్యూజిలాండ్‌ను ఓడించే సీన్ శ్రీలంకకు లేదు.. ఇండియానే డబ్ల్యూటీసీ ఫైనల్ వెళ్తుంది: మంజ్రేకర్

Hari Prasad S HT Telugu
Mar 09, 2023 02:43 PM IST

Manjrekar on WTC Final: న్యూజిలాండ్‌ను ఓడించే సీన్ శ్రీలంకకు లేదు.. ఇండియానే డబ్ల్యూటీసీ ఫైనల్ వెళ్తుంది అని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అనడం విశేషం. నిజానికి కివీస్ తో జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజే శ్రీలంక బ్యాటర్లు మంచి స్కోరు చేశారు.

ఆస్ట్రేలియా, ఇండియా ప్రధానులతో రెండు జట్ల కెప్టెన్లు స్టీవ్ స్మిత్, రోహిత్ శర్మ
ఆస్ట్రేలియా, ఇండియా ప్రధానులతో రెండు జట్ల కెప్టెన్లు స్టీవ్ స్మిత్, రోహిత్ శర్మ (ANI/ PIB)

Manjrekar on WTC Final: న్యూజిలాండ్ లో న్యూజిలాండ్ ను ఓడించే సత్తా శ్రీలంకకు లేదని అన్నాడు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (WTC Final) కోసం ఇండియా, శ్రీలంక మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో మంజ్రేకర్ ఇలా స్పందించాడు. ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ లో జరుగుతున్న నాలుగో టెస్టులో గెలిస్తే ఇండియా నేరుగా ఫైనల్ చేరుతుంది.

లేదంటే శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. ఒకవేళ ఇండియా ఓడిపోతే లేదంటే డ్రా చేసుకుంటే.. అటు న్యూజిలాండ్ పై శ్రీలంక 2-0తో గెలిస్తే ఇండియా కాకుండా శ్రీలంక ఫైనల్ వెళ్తుంది. ఈ రెండు టెస్టుల సిరీస్ గురువారం (మార్చి 9) ప్రారంభమవగా.. తొలి రోజే శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి 305 పరుగులు చేసింది.

అయినా న్యూజిలాండ్ ను వాళ్ల స్వదేశంలో ఓడించే సత్తా శ్రీలంకకు లేదని మంజ్రేకర్ అనడం విశేషం. "చివరి టెస్ట్ అద్భుతంగా ప్రారంభమైంది. మేమూ గ్రౌండ్ లోనే ఉన్నాం. ఈ టెస్టులో ఎన్నో జరుగుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. స్టేడియంలోని ప్రతి సీట్లో ప్రేక్షకులు ఉండటం గొప్ప అనుభూతి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరువలో ఇండియా ఉంది. ఫైనల్ కు ఇండియానే వెళ్తుందని అనుకుంటున్నా. న్యూజిలాండ్ పై గెలిచే సత్తా శ్రీలంకకు ఉందని అనుకోవడం లేదు" అని మంజ్రేకర్ అన్నాడు.

"ఇండియా ఇప్పటికే ఫైనల్ చేరిందని నేను నమ్ముతున్నాను. కానీ అధికారికంగా వెళ్లాల్సి ఉంది. ఆ టెన్షన్ అయితే ఉంది. అంతేకాకుండా ఈ సిరీస్ విజేత కూడా తేలాల్సి ఉంది. ఇండోర్ లో ఆస్ట్రేలియా బలంగా పుంజుకుంది. స్టేడియంలో నరేంద్ర మోదీ కూడా కూర్చున్నారు. ఆ బజ్ స్టేడియంలో కనిపించింది" అని మంజ్రేకర్ అన్నాడు.

అయితే ఈ చివరి టెస్టులోనూ ఆస్ట్రేలియా బ్యాటర్లు మెరుగ్గా ఆడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ టీమ్ టీ సమయానికి కూడా కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయింది. ఈ సిరీస్ లో కాస్త బ్యాటింగ్ కు అనుకూలించేలా అహ్మదాబాద్ పిచ్ కనిపిస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం