IPL 2023 Playoffs : ప్లేఆఫ్స్‌కు అడుగు దూరంలో గుజరాత్ టైటాన్స్
08 May 2023, 10:02 IST
- IPL 2023 Playoffs : ఐపీఎల్ మ్యాచులు జోరుగా జరుగుతున్నాయి. ప్లే ఆఫ్స్ దగ్గరకు వస్తున్నాయి. అయితే గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించడానికి కేవలం ఒక అడుగుదూరంలో మాత్రమే ఉంది.
గుజరాత్ టైటాన్స్
ఐపీఎల్ ప్లేఆఫ్స్(IPL Playoffs)కు ఏయే జట్టు వెళ్తాయని చర్చ జరుగుతోంది. మే 23 నుంచి 28 వరకూ ప్లే ఆఫ్స్ జరగనున్నాయి. చెన్నైలోని చెపాక్ స్టేడియం మే 23, 24వ తేదీల్లో క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వనుంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో మే 26న క్వాలిఫయర్ 2 జరగనుంది. అక్కడే ఫైనల్ కేటాయించారు. మే 28న ఫైనల్ జరగనుంది. అయితే ప్లే ఆఫ్స్ కు గుజరాత్ టైటాన్స్ జట్టు ఒక్క ఆడుగు దూరంలో ఉంది.
IPL 2023లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)16 పాయింట్లు సాధించిన మొదటి జట్టుగా అవతరించింది. ఈసారి కూడా హార్దిక్ పాండ్యా 16 పాయింట్లతో ముందంజలో ఉన్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్‌లకు చేరుకోవడం దాదాపు ఖాయం అయింది. హార్దిక్ పాండ్యా(hardik pandya) జట్టు 11 మ్యాచ్‌ల్లో 8 గెలిచి 16 పాయింట్లతో ఉంది.
గుజరాత్ టైటాన్స్‌కు ఇంకా 3 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి, వాటిలో ఒకటి గెలిస్తే ప్లేఆఫ్‌కు చేరుకోవడం ఖాయం. ఎందుకంటే ప్రస్తుత పాయింట్ల పట్టికలో టాప్-4లో ఉన్న జట్లన్నీ 11 మ్యాచ్‌లు ఆడాయి. గుజరాత్ టైటాన్స్ (16 పాయింట్లు) మాత్రమే అత్యధిక పాయింట్లు సాధించింది. 11 మ్యాచ్ లు ఆడిన మిగతా మూడు జట్లు... 3 మ్యాచ్‌లు గెలిచినా 17, 18 లేదా 19 పాయింట్లు మాత్రమే సాధిస్తాయి.
ఇప్పటికే 16 పాయింట్లతో ఉన్న గుజరాత్ టైటాన్స్ తదుపరి మ్యాచ్ లో గెలిస్తే 18 పాయింట్లతో టాప్-4లో కనిపించడం ఖాయం. అందుకే డిఫెండింగ్ ఛాంపియన్.. ఈసారి కూడా ప్లే ఆఫ్ ఆడడం దాదాపు ఖాయమైపోయింది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఐపీఎల్ 2023లో 16 పాయింట్లు సాధించిన తొలి జట్టుగా గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) నిలిచింది.
మూడు పరాజయాలు ఎదురైనా గుజరాత్ టైటాన్స్ జట్టు ప్రతి దశలోనూ బాగా రాణిస్తోంది. ఫలితంగా ఇప్పుడు 16 పాయింట్లతో +0.951 నెట్ రన్ రేట్‌తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది.