IPL 2022 GT vs LSG | టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న గుజరాత్ టైటన్స్‌-gujarat titans won the toss and elected to bowl against lsg in ipl 2022 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2022 Gt Vs Lsg | టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న గుజరాత్ టైటన్స్‌

IPL 2022 GT vs LSG | టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న గుజరాత్ టైటన్స్‌

Hari Prasad S HT Telugu
Mar 28, 2022 07:09 PM IST

ఐపీఎల్‌లో భాగంగా సోమవారం కొత్త టీమ్స్‌ గుజరాత్‌ టైటన్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ గెలిచిన గుజరాత్‌ టైటన్స్‌ ఫీల్డింగ్ ఎంచుకుంది.

గుజరాత్ టైటన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా
గుజరాత్ టైటన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hotstar Screen grab)

ముంబై: ఐపీఎల్‌లోని రెండు కొత్త టీమ్స్‌ ఒకదానితో మరొకటి అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యాయి. ఇప్పటి వరకూ ప్రతి టాస్‌ గెలిచిన టీమ్‌లాగే గుజరాత్‌ టైటన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా కూడా ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. పాండ్యా తన కెరీర్‌లో తొలిసారి ఓ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. గత సీజన్‌ వరకూ పంజాబ్‌ కింగ్స్‌కు కెప్టెన్‌గా ఉన్న రాహుల్‌ ఈసారి లక్నోకి సారథ్యం వహిస్తున్నాడు. గుజరాత్ టైటన్స్ నలుగురు విదేశీ ప్లేయర్స్ లాకీ ఫెర్గూసన్, రషీద్ ఖాన్, డేవిడ్ మిల్లర్, మాథ్యూ వేడ్ లను బరిలోకి దించింది. 

అటు లక్నో ముగ్గురు విదేశీ ప్లేయర్స్ డీకాక్, చమీర, లూయిస్ లను ఆడిస్తోంది. వాంఖెడే స్టేడియంలో కొత్త పిచ్ పై ఈ మ్యాచ్ జరగనుంది. ఈ పిచ్ కూడా బ్యాటింగ్ కు అనుకూలించనుంది. ఇప్పటి వరకూ జరిగిన మూడు మ్యాచ్ లలోనూ చేజింగ్ టీమ్సే గెలిచాయి. మరి ఈ మ్యాచ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

WhatsApp channel

టాపిక్