Pandya Fires On Shami: ష‌మీపై హార్దిక్ పాండ్యా ఆగ్ర‌హం - వీడియో వైర‌ల్‌-gt skipper pandya fires on pacer shami video viral ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Gt Skipper Pandya Fires On Pacer Shami Video Viral

Pandya Fires On Shami: ష‌మీపై హార్దిక్ పాండ్యా ఆగ్ర‌హం - వీడియో వైర‌ల్‌

Nelki Naresh Kumar HT Telugu
Apr 17, 2023 12:36 PM IST

Pandya Fires On Shami: గుజ‌రాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పేస‌ర్ ష‌మీపై ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తోన్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. గుజ‌రాత్ టైటాన్స్‌, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ఈ సంఘ‌ట‌న చోటుచేసుకుంది.

అశ్విన్, పాండ్యా
అశ్విన్, పాండ్యా

Pandya Fires On Shami: గుజ‌రాత్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీపై కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశాడు. ఆదివారం రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, గుజ‌రాత్ టైటాన్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ఈ సంఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. గుజ‌రాత్ గెలుపు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్న త‌రుణంలో 19వ ఓవ‌ర్ సీనియ‌ర్ పేస‌ర్ ష‌మీకి బంతిని అప్ప‌గించాడు హార్దిక్ పాండ్యా.

ట్రెండింగ్ వార్తలు

హార్దిక్‌ న‌మ్మ‌కాన్ని నిల‌బెడుతూ ఈ ఓవ‌ర్‌లో ధృవ్ జురేల్‌తో పాటు అశ్విన్‌ను ఔట్ చేశాడు ష‌మీ. కానీ ఈ ఓవ‌ర్‌లో ప‌ద‌హారు ర‌న్స్ కూడా ఇచ్చాడు. ధృవ్ జురేల్ ఔట్ కాగానే బ్యాటింగ్ దిగిన అశ్విన్ తాను ఎదుర్కొన్న ఫ‌స్ట్ బంతిని ఫోర్‌గా మ‌లిచాడు. ఆ త‌ర్వాతి బాల్‌ను డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్స్ కొట్టాడు. వ‌రుస‌గా రెండు బాల్స్‌లో సిక్స్‌, ఫోర్ ఇవ్వ‌డంతో ష‌మీపై హార్దిక్ అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు.

బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఫీల్డింగ్ చేస్తోన్నపాండ్యా రెండు చేతుల‌ను చాచుతూ ష‌మీపై వైపు కోపంగా చూస్తోన్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ప‌లువురు నెటిజ‌న్లు ఈ వీడియోను షేర్ చేస్తోన్నారు.

హార్దిక్‌కు ఇదే అలవాటే అంటూనెటిజ‌న్లు ఈ వీడియోను ఉద్దేశించి కామెంట్స్ చేస్తోన్నారు. కొంద‌రు హార్దిక్‌ను త‌ప్పుప‌డుతోండ‌గా మ‌రికొంద‌రు మాత్రం ష‌మీదే త‌ప్పు అంటూ కామెంట్స్ చేస్తోన్నారు. అశ్విన్ సిక్స్‌, ఫోర్ కొట్ట‌డంతో రాజ‌స్థాన్ టార్గెట్ సింపుల్‌గా మారింది. నెక్స్ట్ ఓవ‌ర్‌లో హెట్‌మేయ‌ర్ సిక్స్‌తో రాజ‌స్థాన్‌కు విజ‌యాన్ని అందించాడు.

WhatsApp channel