Ravi Shastri on GT: మళ్లీ గుజరాత్ టైటన్స్‌దే ఐపీఎల్ ట్రోఫీ: రవిశాస్త్రి-ravi shastri on gt says hardik pandyas team will win ipl trophy ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ravi Shastri On Gt: మళ్లీ గుజరాత్ టైటన్స్‌దే ఐపీఎల్ ట్రోఫీ: రవిశాస్త్రి

Ravi Shastri on GT: మళ్లీ గుజరాత్ టైటన్స్‌దే ఐపీఎల్ ట్రోఫీ: రవిశాస్త్రి

Hari Prasad S HT Telugu
May 05, 2023 12:00 PM IST

Ravi Shastri on GT: మళ్లీ గుజరాత్ టైటన్స్‌దే ఐపీఎల్ ట్రోఫీ అని అన్నాడు రవిశాస్త్రి. ప్రస్తుతం ఆ టీమ్ ఉన్న ఫామ్, నిలకడగా ఆడుతున్న తీరు వాళ్లే విజేతలని స్పష్టం చేస్తున్నట్లు చెప్పాడు.

గుజరాత్ టైటన్స్ టీమ్
గుజరాత్ టైటన్స్ టీమ్ (IPL Twitter)

Ravi Shastri on GT: ఈసారి ఐపీఎల్ ట్రోఫీ ఎవరు గెలుస్తారు? టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి అయితే డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటన్సే మళ్లీ కప్పు గెలుస్తారని తేల్చేశాడు. దీనికి కారణమేంటో కూడా అతడు వివరించాడు. ప్రస్తుతం గుజరాత్ టైటన్స్ టీమ్ 12 పాయింట్లతో టాప్ లో ఉంది. 9 మ్యాచ్ లలో 6 విజయాలు సాధించింది పాండ్యా టీమ్.

గతేడాది ఏమాత్రం అంచనాలు లేకుండా ఓ కొత్త జట్టుగా ఐపీఎల్ బరిలోకి దిగిన గుజరాత్ టైటన్స్ ఏకంగా ట్రోఫీ ఎగరేసుకుపోయి ఆశ్చర్యపరిచింది. అయితే అది గాలివాటం విజయం కాదని ఈసారి జీటీ టీమ్ నిరూపిస్తోంది. ఈ సీజన్ లోనూ నిలకడగా ఆడుతున్న టీమ్ అదొక్కటే. ఆర్సీబీ, సీఎస్కే, ఎంఐలాంటి జట్లతో పోలిస్తే పెద్దగా స్టార్లు లేకపోయినా.. సమష్టిగా రాణిస్తూ జీటీ దూసుకెళ్తోంది.

అందుకే ఈసారి కూడా ట్రోఫీ వాళ్లదే అని రవిశాస్త్రి స్పష్టం చేస్తున్నాడు. "ప్రస్తుత ఫామ్, పాయింట్ల టేబుల్ చూస్తే ఈసారి కూడా ట్రోఫీని గుజరాతే గెలుస్తుందని నేను అనుకుంటున్నాను. వాళ్ల దగ్గర నిలకడ ఉంది. ఫ్లెక్సిబిలీటీ ఉంది. ఏడెనిమిది మంది ప్లేయర్స్ నిలకడగా ఆడుతున్నారు. ఈ జట్టులోని ప్లేయర్స్ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు" అని స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ రవిశాస్త్రి అన్నాడు.

అయితే గుజరాత్ తన చివరి మ్యాచ్ లో పాయింట్ల టేబుల్లో చివరి స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ చేతుల్లో ఓడింది. అంతకుముందు హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్తున్న జీటీకి డీసీ షాకిచ్చింది. శుక్రవారం (మే 5) గతేడాది రన్నరప్ రాజస్థాన్ రాయల్స్ తో గుజరాత్ తలపడనుంది.

ఈ సందర్భంగా రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ పై కూడా రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. అతడో పరిణతి కలిగిన కెప్టెన్ అని, ఓ మంచి కెప్టెనే ముగ్గురు స్పిన్నర్లను బరిలోకి దింపి వాళ్లను తెలివిగా వాడుకుంటాడని అన్నాడు.

WhatsApp channel

సంబంధిత కథనం