GT vs DC IPL 2023 : అగ్ర జట్టుపై అదిరే విజయం.. దిల్లీ ఖాతాలో మూడో గెలుపు-delhi capitals defeated gujarat titans by five runs in ipl 2023 here to watch photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Gt Vs Dc Ipl 2023 : అగ్ర జట్టుపై అదిరే విజయం.. దిల్లీ ఖాతాలో మూడో గెలుపు

GT vs DC IPL 2023 : అగ్ర జట్టుపై అదిరే విజయం.. దిల్లీ ఖాతాలో మూడో గెలుపు

Jan 08, 2024, 06:51 PM IST Maragani Govardhan
May 03, 2023, 09:12 AM , IST

  • gujarat titans vs delhi capitals live score : ఐపీఎల్‌లో వరుసగా రెండో రోజు ఉత్కంఠ భరితమైన మ్యాచ్ జరిగింది. సోమవారం లక్నో-బెంగళూరు మధ్య నరాలు తెగే మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించగా.. మంగళవారం నాడు గుజరాత్‌పై దిల్లీ గెలిచింది. 131 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక అగ్ర జట్టయిన గుజరాత్ ఓటమి పాలైంది.

GT vs DC IPL 2023 : అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్‌పై దిల్లీ 5 పరుగుల తేాడాతో గెలిచింది. 

(1 / 6)

GT vs DC IPL 2023 : అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో గుజరాత్‌పై దిల్లీ 5 పరుగుల తేాడాతో గెలిచింది. (AFP)

131 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ 125 పరుగులే చేయగలిగింది. చివరి ఓవర్లో దిల్లీ బౌలర్ ఇషాంత్ శర్మ 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.

(2 / 6)

131 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ 125 పరుగులే చేయగలిగింది. చివరి ఓవర్లో దిల్లీ బౌలర్ ఇషాంత్ శర్మ 6 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.(IPL Twitter)

అంతకుముందు బ్యాటింగ్ చేసిన దిల్లీ.. అమన్ ఖాన్ అర్ధశతకం మినహా మిగిలిన వారు విఫలం కావడంతో 130 పరుగులే చేయగలిగింది. 

(3 / 6)

అంతకుముందు బ్యాటింగ్ చేసిన దిల్లీ.. అమన్ ఖాన్ అర్ధశతకం మినహా మిగిలిన వారు విఫలం కావడంతో 130 పరుగులే చేయగలిగింది. (Delhi Capitals Twitter)

లక్ష్య ఛేదనలో గుజరాత్.. పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయింది. అనంతరం హార్దిక్, అభినవ్ మనోహర్ చాలా వరకు పోరాడారు. 

(4 / 6)

లక్ష్య ఛేదనలో గుజరాత్.. పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయింది. అనంతరం హార్దిక్, అభినవ్ మనోహర్ చాలా వరకు పోరాడారు. (IPL Twitter)

చివరి ఓవర్లో గుజరాత్ గెలుపునకు 12 పరుగులు అవసరం కాగా.. ఇషాంత్ శర్మ 6 పరుగులే ఇచ్చాడు. అంతేకాకుండా రాహుల్ తెవాటియా వికెట్ కూడా తీశాడు. 

(5 / 6)

చివరి ఓవర్లో గుజరాత్ గెలుపునకు 12 పరుగులు అవసరం కాగా.. ఇషాంత్ శర్మ 6 పరుగులే ఇచ్చాడు. అంతేకాకుండా రాహుల్ తెవాటియా వికెట్ కూడా తీశాడు. (IPL Twitter)

గుజరాత్ తరఫున మహమ్మద్ షమీ 4 వికెట్లు తీయగా.. మోహిత్ శర్మ 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్ చెరో 2 వికెట్లు తీశారు.

(6 / 6)

గుజరాత్ తరఫున మహమ్మద్ షమీ 4 వికెట్లు తీయగా.. మోహిత్ శర్మ 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. దిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్ చెరో 2 వికెట్లు తీశారు.(AP)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు