తెలుగు న్యూస్  /  Sports  /  Hardik Pandya Vs Nehra As Coach And Captain In Heated Conversation

Hardik Pandya vs Nehra: కొడతాడా ఏంటి.. హార్దిక్ పాండ్యాపై నెహ్రా ఎలా విరుచుకుపడ్డాడో చూడండి

Hari Prasad S HT Telugu

16 May 2023, 20:45 IST

    • Hardik Pandya vs Nehra: కొడతాడా ఏంటి.. హార్దిక్ పాండ్యాపై నెహ్రా ఎలా విరుచుకుపడ్డాడో చూడండి. గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ మ్యాచ్ సందర్భంగా ఈ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
పాండ్యాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెహ్రా
పాండ్యాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెహ్రా

పాండ్యాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెహ్రా

Hardik Pandya vs Nehra: గుజరాత్ టైటన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ఆ టీమ్ హెడ్ కోచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. సన్ రైజర్స్ తో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ సందర్భంగా కనిపించిన ఈ సీన్ చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎప్పుడూ నవ్వుతూ సరదాగా ఉండే నెహ్రా.. పాండ్యాపై ఇంతలా విరుచుకుపడ్డాడేంటి అని ఈ వీడియో చూస్తే అనిపించడం ఖాయం.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

నిజానికి ఈ మ్యాచ్ లో జీటీ గెలిచి.. ప్లేఆఫ్స్ చేరిన తొలి టీమ్ గా నిలిచింది. అయినా నెహ్రా కోపానికి కారణమేంటో అర్థం కాలేదు. ఈ మ్యాచ్ లో జీటీ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సెంచరీ బాదాడు. అయితే ఆ టీమ్ మాత్రం 188 పరుగులకే పరిమితమైంది. గిల్, సాయి సుదర్శన్ తప్ప మిగతా బ్యాటర్లు ఎవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. ఆ టీమ్ బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది.

దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత పాండ్యాపై నెహ్రా ఇలా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆ వీడియో చూసిన వాళ్లు అంచనా వేస్తున్నారు. తొలి ఓవర్లోనే సాహా ఔటైన తర్వాత గిల్, సుదర్శన్ రెండో వికెట్ కు 147 పరుగులు జోడించారు. ఆ సమయంలో టైటన్స్ సులువుగా 200కుపైగా స్కోరు చేస్తారని భావించారు. కానీ మరో 41 పరుగుల్లోనే మిగిలిన 8 వికెట్లు పడిపోయాయి.

ఇదే నెహ్రాకు ఈ స్థాయిలో ఆగ్రహం తెప్పించింది. గిల్ సెంచరీ తర్వాత కూడా నెహ్రా అసహనంగానే కనిపించాడు. అయితే సన్ రైజర్స్ ఆ స్కోరును కూడా ఛేదించలేకపోయింది. ఈ విజయంతో గుజరాత్ టైటన్స్ ప్లేఆఫ్స్ చేరగా.. ఎస్ఆర్‌హెచ్ ఇంటిదారి పట్టింది.