Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. ఈ ఘనత సాధించిన తొలి జీటీ ప్లేయర్-shubman gill record with his maiden ipl hundred against srh on monday may 15th ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Shubman Gill Record With His Maiden Ipl Hundred Against Srh On Monday May 15th

Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. ఈ ఘనత సాధించిన తొలి జీటీ ప్లేయర్

Hari Prasad S HT Telugu
May 15, 2023 09:35 PM IST

Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి జీటీ ప్లేయర్ గా నిలిచాడు. సోమవారం (మే 15) సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో గిల్ సెంచరీ బాదాడు.

సెంచరీతో రికార్డులు క్రియేట్ చేసిన శుభ్‌మన్ గిల్
సెంచరీతో రికార్డులు క్రియేట్ చేసిన శుభ్‌మన్ గిల్ (AFP)

Shubman Gill Record: ఐపీఎల్లో శుభ్‌మన్ గిల్ తొలి సెంచరీ బాదాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో సోమవారం (మే 15) అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో గిల్ మూడంకెల స్కోరు అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి గుజరాత్ టైటన్స్ ప్లేయర్ గా గిల్ నిలిచాడు. ఇదే సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై 94 పరుగుల దగ్గర ఆగిపోయిన గిల్.. ఈసారి సెంచరీ మార్క్ అందుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

56 బంతుల్లోనే సెంచరీ చేసిన గిల్.. చివరికి 58 బంతుల్లో 101 పరుగులు చేశాడు. జీటీ టీమ్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు కూడా ఇప్పుడు గిల్ పేరిటే ఉంది. ఈ ఏడాది ఎస్ఆర్‌హెచ్ తో మ్యాచ్ కు ముందు వరకు 12 మ్యాచ్ లు ఆడిన గిల్.. నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు. అవన్నీ నరేంద్ర మోదీ స్టేడియంలోనే రాగా.. ఇప్పుడు సెంచరీ కూడా అక్కడే సాధించడం విశేషం.

గిల్ సెంచరీతో జీటీ టీమ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 రన్స్ చేసింది. సాయి సుదర్శన్ 47 రన్స్ చేశాడు. ఈ ఇద్దరూ తప్ప మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. మరే ఇతర బ్యాటర్ రెండంకెల స్కోరు అందుకోలేదు. గిల్, సుదర్శన్ కలిసి రెండో వికెట్ కు 147 పరుగులు జోడించారు. దీంతో జీటీ ఈ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. సన్ రైజర్స్ బౌలర్ భువనేశ్వర్ 4 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు.

గిల్ మొదట 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయగా.. తర్వాత ఫిఫ్టీ అందుకోవడానికి 34 బంతులు తీసుకున్నాడు. ఇక ఈ సీజన్లో అతడు 500 ప్లస్ మార్క్ కూడా అందుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్ లో గిల్ 500కుపైగా రన్స్ చేయడం ఇదే తొలిసారి. గతేడాది 483 రన్స్ చేశాడు. అంతేకాదు గుజరాత్ టైటన్స్ తరఫున ఐపీఎల్లో 1000 పరుగులు చేసి ఏకైక ప్లేయర్ గా కూడా గిల్ నిలిచాడు.

ఐపీఎల్ 2023లో నమోదైన ఆరో సెంచరీ ఇది. ఇప్పటి వరకూ సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్, హ్యారీ బ్రూక్, యశస్వి జైస్వాల్, ప్రభ్‌సిమ్రన్ సింగ్ సెంచరీలు చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది నరేంద్ర మోదీ స్టేడియంలోనే గిల్ 400కుపైగా రన్స్ చేశాడు. ఓ వేదికలో ఈ ఏడాది ఓ బ్యాటర్ సాధించిన అత్యధిక పరుగులు ఇవే.

WhatsApp channel

సంబంధిత కథనం