Shubman Gill: హాలీవుడ్ సూపర్ హీరో మూవీకి శుభ్‌మన్ గిల్ డబ్బింగ్ - ఫస్ట్ క్రికెటర్‌గా రికార్డ్
Shubman Gill:టీమ్ ఇండియా యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ స్పైడర్ మ్యాన్ మూవీకి డబ్బింగ్ చెప్పబోతున్నాడు. హాలీవుడ్ మూవీకి డబ్బింగ్ చెప్పనున్న ఫస్ట్ క్రికెటర్‌గా శుభ్‌మన్ రికార్డ్ క్రియేట్ నెలకొల్పనున్నాడు.
Shubman Gill:క్లాస్ బ్యాటింగ్‌తో క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరిస్తోన్న టీమ్ ఇండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తన మాటలతో సిల్వర్ స్క్రీన్‌పై మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతోన్నాడు. స్పైడర్ మ్యాన్ మూవీకి శుభ్‌మన్‌గిల్ డబ్బింగ్ చెప్పబోతున్నాడు. స్పైడర్ మ్యాన్ సిరీస్‌లో భాగంగా స్పైడర్ మ్యాన్ అక్రాస్ ది స్పైడర్ వెర్స్ పేరుతో ఓ మూవీ తెరకెక్కుతోంది.
ట్రెండింగ్ వార్తలు
ఈ యానిమేటెడ్ మూవీ ఇండియన్ వెర్షన్‌కు యంగ్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ డబ్బింగ్ చెప్పబోతున్నాడు. ఈ సినిమా హిందీతో పాటు పంజాబీ వెర్షన్స్‌కు శుభ్‌మన్ గిల్ వాయిస్ వినిపించనున్నది. పవిత్ర్ ప్రభాకర్ అలియాస్ ఇండియన్ స్పైడర్ మ్యాన్ అనే క్యారెక్టర్ నేపథ్యంలో ఇండియన్ వెర్షన్ మూవీ సాగనుంది. ఈ క్యారెక్టర్‌కు శుభ్‌మన్‌గిల్ డబ్బింగ్ చెప్పబోతున్నాడు.
స్పైడర్ మ్యాన్ కు శుభ్‌మన్ గిల్ డబ్బింగ్ చెప్పనున్న విషయాన్ని సోమవారం ఓ వీడియో ద్వారా సినిమా యూనిట్ రివీల్ చేసింది. హాలీవుడ్ మూవీకి డబ్బింగ్ చెప్పనున్న తొలి క్రికెటర్‌గా శుభ్‌మన్‌గిల్ చరిత్రను సృష్టించనున్నాడు. ఈ రికార్డ్‌ను నెలకొల్పనున్న తొలి ఇండియన్ స్పోర్ట్స్ పర్సన్ కూడా అతడే కావడం గమనార్హం.
జూన్ 2న ప్రధాన భారతీయ భాషలన్నింటిలో స్పైడర్ మ్యాన్ మూవీ రిలీజ్ కానుంది. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు శుభ్‌మన్ గిల్ ప్రాతినిథ్యం వహిస్తోన్నాడు. చక్కటి బ్యాటింగ్‌తో రాణిస్తోన్న గిల్ 11 మ్యాచుల్లో నాలుగు హాఫ్ సెంచరీలతో 469 రన్స్ చేశాడు.
టాపిక్