తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Hardik Pandya On Lsg: రాహుల్ కెప్టెన్సీలో ల‌క్నో టీమ్‌కు ఆడాల‌నుకున్నా - హార్దిక్ పాండ్యా ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

Hardik Pandya on Lsg: రాహుల్ కెప్టెన్సీలో ల‌క్నో టీమ్‌కు ఆడాల‌నుకున్నా - హార్దిక్ పాండ్యా ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

15 April 2023, 12:37 IST

  • Hardik Pandya on Lsg: ఐపీఎల్‌లో గుజ‌రాత్ టైటాన్స్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్నాడు ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా. అయితే గుజ‌రాత్ కంటే ముందు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ టీమ్ త‌న‌ను సంప్ర‌దించింద‌ని, ఆ టీమ్‌కు ప్రాతినిథ్యం వ‌హించాల‌ని డిసైడ్ అయిన‌ట్లు పాండ్యా తెలిపాడు.

హార్దిక్ పాండ్య‌.
హార్దిక్ పాండ్య‌.

హార్దిక్ పాండ్య‌.

Hardik Pandya on Lsg: ఐపీఎల్‌లోకి గ‌త ఏడాది కొత్త ఫ్రాంచైజ్‌గా గుజ‌రాత్ టైటాన్స్ ఎంట్రీ ఇచ్చింది. తొలి ప్ర‌య‌త్నంతోనే క‌ప్ గెలిచి చ‌రిత్ర‌ను సృష్టించింది. గుజ‌రాత్ టైటాన్స్‌ టైటిల్ గెల‌వ‌డంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీల‌క‌భూమిక పోషించాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణించ‌డ‌మే కాకుండా కెప్టెన్‌గా జ‌ట్టులో స్ఫూర్తిని నింపుతూ స‌మ‌న్వ‌యంతో ముందుకు న‌డిపించాడు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

Pro Kabaddi League Winner: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 10 విజేత పుణెరి పల్టన్.. ఫైనల్లో హర్యానా చిత్తు

ఐపీఎల్‌లో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో జాతీయ జ‌ట్టులోకి ఘ‌నంగా రీఎంట్రీ ఇచ్చాడు పాండ్య‌. అయితే గుజ‌రాత్‌టైటాన్స్ కంటే ముందు త‌న‌ను ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఫ్రాంచైజ్ త‌న‌ను సంప్ర‌దించింద‌ని హార్దిక్ పాండ్యా అన్నాడు. గుజ‌రాత్ టైటాన్ పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ త‌మ జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌మ‌ని ల‌క్నో ఫ్రాంచైజ్ నుంచి త‌న‌కు మొద‌ట ఆహ్వానం అందింద‌ని పేర్కొన్నాడు.

అప్ప‌టికే ల‌క్నోకు కెప్టెన్‌గా రాహుల్ పేరును ప్ర‌క‌టించార‌ని పాండ్యా తెలిపాడు. రాహుల్‌తో త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా చ‌క్క‌టి అనుబంధం ఉండ‌టంతో అత‌డి కెప్టెన్సీలో ఆడాల‌ని నిర్ణ‌యించుకున్నాన‌ని చెప్పాడు. నేనేమిటో, నా బ‌లాలు, బ‌ల‌హీన‌త‌లు అన్ని రాహుల్‌కు తెలుసు. న‌న్ను ద‌గ్గ‌ర‌గా చూశాడు. తెలియ‌ని కెప్టెన్‌తో క‌లిసి ఆడ‌టం కంటే తెలిసిన వాడితో ఆడ‌టం ఆట‌గాడిగా నా కెరీర్‌కు ఎంతో హెల్ప్ చేసుంద‌ని అనుకున్నా.

ల‌క్నో టీమ్‌కు ఓకే చెప్పాల‌ని డిసైడ్ అయ్యా. అదే స‌మ‌యంలో ఆశీష్ నెహ్రా గుజ‌రాత్ టీమ్‌కు కోచ్‌గా తాను ఎంపిక‌కావ‌డం ఖాయ‌మ‌ని అన్నాడు. అత‌డు గుజ‌రాత్‌లో భాగం కావ‌డంతో నేను ఆ టీమ్ త‌ర‌ఫునే ఆడాల‌ని నిర్ణ‌యించుకున్నా. ఆట‌గాడిగా నా ఎదుగుద‌ల‌లో నెహ్రా భాగ‌స్వామ్యం ఎంతో ఉంది. నెహ్రా వ‌ల్ల ల‌క్నో నుంచి గుజ‌రాత్ టీమ్‌కు మారాను అంటూ హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు. అత‌డి కామెంట్స్ వైర‌ల్‌గా మారాయి.