తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Gt Vs Csk: చెన్నై, గుజరాత్ మ్యాచ్‌లో 84 డాట్ బాల్స్.. 42 వేల మొక్కలు నాటనున్న బీసీసీఐ

GT vs CSK: చెన్నై, గుజరాత్ మ్యాచ్‌లో 84 డాట్ బాల్స్.. 42 వేల మొక్కలు నాటనున్న బీసీసీఐ

Hari Prasad S HT Telugu

24 May 2023, 16:30 IST

google News
    • GT vs CSK: చెన్నై, గుజరాత్ మ్యాచ్‌లో 84 డాట్ బాల్స్ పడ్డాయి. దీంతో 42 వేల మొక్కలు నాటనుంది బీసీసీఐ. ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్ లతో ఈ వినూత్న కార్యక్రమానికి బోర్డు శ్రీకారం చుట్టింది.
చెన్నై, గుజరాత్ మ్యాచ్ లో డాట్ బాల్స్ స్థానంలో ట్రీ ఎమోజీలు
చెన్నై, గుజరాత్ మ్యాచ్ లో డాట్ బాల్స్ స్థానంలో ట్రీ ఎమోజీలు (Screengrab)

చెన్నై, గుజరాత్ మ్యాచ్ లో డాట్ బాల్స్ స్థానంలో ట్రీ ఎమోజీలు

GT vs CSK: ఐపీఎల్లో ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది బీసీసీఐ. ప్లేఆఫ్స్ స్టేజ్ లో జరిగే మ్యాచ్‌లలో పడే ప్రతి డాట్ బాల్‌కు 500 మొక్కలు నాటాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటన్స్ మధ్య జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో 84 డాట్ బాల్స్ లో పడటంతో మొత్తం 42 వేల మొక్కలను బోర్డు నాటనుంది.

తాము చేపట్టిన ఈ కొత్త కార్యక్రమం గురించి మ్యాచ్ సందర్భంగానే బీసీసీఐ వెల్లడించింది. మ్యాచ్ స్కోరుబోర్డులో డాట్ బాల్ పడిన ప్రతిసారీ ఓ ట్రీ ఎమోజీని చూపించారు. దీనికి కారణమేంటో ఆ సమయంలో కామెంట్రీ చేస్తున్న సైమన్ డౌల్ తెలిపాడు. ప్రతి డాట్ బాల్ కు బీసీసీఐ 500 మొక్కలు నాటుతుందని అతడు చెప్పాడు. పర్యావరణాన్ని పరిరక్షించే లక్ష్యంతో బోర్డు ఈ వినూత్న కార్యక్రమం చేపట్టింది.

తొలి క్వాలిఫయర్ జరిగిన చెన్నైలోని చెపాక్ పిచ్ కాస్త నెమ్మదిగా ఉండటంతో రెండు జట్ల బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. దీంతో మ్యాచ్ లో ఏకంగా 84 డాట్ బాల్స్ నమోదయ్యాయి. ఒక్కో డాట్ బాల్ కు 500 చొప్పున మొత్తం 42 వేల మొక్కలు నాటనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విటర్ ద్వారా వెల్లడించారు.

"ఐపీఎల్ ప్లేఆఫ్స్ లో ఒక్కో డాట్ బాల్ కు 500 మొక్కలు నాటడానికి టాటా కంపెనీస్ తో చేతులు కలపడం గర్వంగా ఉంది. క్వాలిఫయర్ 1లో 84 డాట్ బాల్స్ కారణంగా 42 వేల మొక్కలు నాటనున్నాం. టీ20 బ్యాటర్లు గేమ్ అని ఎవరు అన్నారు? బౌలర్లూ అంతా మీ చేతుల్లోనే ఉంది" అంటూ టాటాఐపీఎల్ గ్రీన్ డాట్స్ హ్యాష్‌ట్యాగ్ యాడ్ చేశారు.

ఈ మ్యాచ్ లో 15 పరుగులతో గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ 10వసారి ఐపీఎల్ ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో మొదట చెన్నై 172 రన్స్ చేయగా.. తర్వాత గుజరాత్ టైటన్స్ 20 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది.

తదుపరి వ్యాసం