తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Gavaskar On Rohit Sharma: ధోనీ అయ్యుంటే ఆకాశానికెత్తేవాళ్లు.. రోహిత్ కదా ఎవరూ పట్టించుకోలేదు: గవాస్కర్ షాకింగ్ కామెంట్స్

Gavaskar on Rohit Sharma: ధోనీ అయ్యుంటే ఆకాశానికెత్తేవాళ్లు.. రోహిత్ కదా ఎవరూ పట్టించుకోలేదు: గవాస్కర్ షాకింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu

26 May 2023, 9:05 IST

google News
    • Gavaskar on Rohit Sharma: ధోనీ అయ్యుంటే ఆకాశానికెత్తేవాళ్లు.. రోహిత్ కదా ఎవరూ పట్టించుకోలేదు అంటూ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. కెప్టెన్సీ విషయంలో రోహిత్ శర్మకు రావాల్సిన క్రెడిట్ ఎప్పుడూ రాలేదని అతడు అనడం విశేషం.
రోహిత్, ధోనీ కెప్టెన్సీలపై గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
రోహిత్, ధోనీ కెప్టెన్సీలపై గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ (PTI-ANI)

రోహిత్, ధోనీ కెప్టెన్సీలపై గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Gavaskar on Rohit Sharma: ధోనీ, రోహిత్ కెప్టెన్సీలను పోలుస్తూ మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సంచలన కామెంట్స్ చేశాడు. ధోనీ ఏ పని చేసినా ఆకాశానికెత్తుతారని, రోహిత్ అదే చేస్తే ఎవరూ పట్టించుకోరు అన్నట్లుగా సన్నీ కామెంట్స్ ఉన్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో పూరన్ ను ఔట్ చేయడానికి రోహిత్ వేసిన ఎత్తుగడ గురించి చెబుతూ గవాస్కర్ ఈ కామెంట్స్ చేయడం విశేషం.

ఈ మ్యాచ్ లో ఆకాశ్ మధ్వాల్ 5 వికెట్లు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అతని సంచలన స్పెల్ వెనుక కెప్టెన్ గా రోహిత్ వేసిన ఎత్తుగడలు కూడా ఉన్నాయి. కానీ ఈ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. అదే సీఎస్కే టీమ్, కెప్టెన్ గా ధోనీ ఉండి ఉంటే ఈ విషయాన్ని అందరూ ప్రముఖంగా ప్రస్తావించేవారని గవాస్కర్ అన్నాడు.

ఆ మ్యాచ్ తర్వాత ఇండియా టుడేతో మాట్లాడుతూ లిటిల్ మాస్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. "కెప్టెన్ గా రోహిత్ ను రావాల్సినంత పేరు రాలేదు. అతడు ముంబై ఇండియన్స్ కు ఐదు టైటిల్స్ అందించాడు. నేనొక ఉదాహరణ చెబుతాను. మధ్వాల్.. ఆయుష్ బదోనిని ఓవర్ ద వికెట్ బౌలింగ్ చేస్తూ ఔట్ చేశాడు. లెఫ్ట్ హ్యాండర్ పూరన్ రాగానే అరౌండ్ ద వికెట్ బౌలింగ్ చేశాడు.

ఓవర్ ద వికెట్ లో బాగా బౌలింగ్ చేస్తున్నామని అనుకున్నప్పుడు చాలా మంది బౌలర్లు లెఫ్ట్ హ్యాండర్ బ్యాటింగ్ చేస్తున్నా సరే ఓవర్ ద వికెట్ కే కట్టుబడి ఉంటారు. లెఫ్ట్ హ్యాండర్ కు దూరంగా బంతిని వేయడానికి ప్రయత్నిస్తారు. కానీ మధ్వాల్ మాత్రం అరౌండ్ ద వికెట్ బౌలింగ్ చేసి తొలి బంతికి పూరన్ ను ఔట్ చేశాడు.

ఒకవేళ అది సీఎస్కే అయి ఉండి, ధోనీ కెప్టెన్ గా ఉంటే.. అందరూ పూరన్ ను ఔట్ చేయడానికి ధోనీ వేసిన ఎత్తుగడలాగా చెప్పేవారు. చాలా సందర్భాల్లో ఇదే జరుగుతుంది. కొన్నిసార్లు కాస్త ఎక్కువే చేస్తారు" అని గవాస్కర్ అనడం విశేషం.

మధ్వాల్ అంత అద్భుతంగా బౌలింగ్ చేయడం వెనుక రోహిత్ కు కూడా క్రెడిట్ ఇవ్వాలని సన్నీ అభిప్రాయపడ్డాడు. "ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే.. మధ్వాల్ కు అరౌండ్ ద వికెట్ బౌలింగ్ చేయాలని చెప్పిన రోహిత్ కు ఆ క్రెడిట్ ఇవ్వడం లేదు. కెప్టెన్సీ నిర్ణయాలు కూడా బాగున్నాయి.

నేహల్ వధేరాను ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడటం కూడా అలాంటిదే. మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చాలా జట్లు ఓ బ్యాటర్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా ఉపయోగించవు. అయినా రోహిత్ మాత్రం వధేరాను బరిలోకి దించాడు. దానికి కూడా రోహిత్ కు క్రెడిట్ ఇవ్వండి" అని గవాస్కర్ అన్నాడు.

తదుపరి వ్యాసం