Ganguly on Dhoni: ఎలా గెలవాలో ధోనీ, సీఎస్కే చూపించింది: గంగూలీ-ganguly on dhoni says csk has shown how to win big matches
Telugu News  /  Sports  /  Ganguly On Dhoni Says Csk Has Shown How To Win Big Matches
ఎమ్మెస్ ధోనీ, సౌరవ్ గంగూలీ
ఎమ్మెస్ ధోనీ, సౌరవ్ గంగూలీ (PTI)

Ganguly on Dhoni: ఎలా గెలవాలో ధోనీ, సీఎస్కే చూపించింది: గంగూలీ

25 May 2023, 21:39 ISTHari Prasad S
25 May 2023, 21:39 IST

Ganguly on Dhoni: ఎలా గెలవాలో ధోనీ, సీఎస్కే చూపించిందని అన్నాడు గంగూలీ. తొలి క్వాలిఫయర్ లో సీఎస్కే.. గుజరాత్ టైటన్స్ పై గెలిచిన తర్వాత దాదా ఈ కామెంట్స్ చేయడం విశేషం.

Ganguly on Dhoni: చెన్నై సూపర్ కింగ్స్, ఆ టీమ్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ. పెద్ద మ్యాచ్ లను ఎలా గెలవాలో సీఎస్కే, ధోనీ చూపించారని దాదా అన్నాడు. గతేడాది దారుణంగా 9వ స్థానంలో ముగించిన సీఎస్కే.. ఈ ఏడాది అద్భుతంగా పుంజుకొని రికార్డు స్థాయిలో పదోసారి ఐపీఎల్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే.

అదే సమయంలో గంగూలీ క్రికెట్ డైరెక్టర్ గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఈసారి 9వ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో సీఎస్కే సక్సెస్ పై దాదా ఈ కామెంట్స్ చేయడం ఆసక్తి రేపింది. ఇండియా టుడేతో మాట్లాడిన అతడు.. ధోనీ కెప్టెన్సీపై ప్రశంసలు కురిపించాడు.

"చెన్నై సూపర్ కింగ్స్, ధోనీ అద్భుతం. పెద్ద మ్యాచ్ లను ఎలా గెలవాలో వాళ్లు చూపించారు. తన కెప్టెన్సీలో ధోనీకి తిరుగులేదు. అతడు కూడా పెద్ద మ్యాచ్ లను ఎలా గెలవాలో చూపించాడు" అని గంగూలీ అన్నాడు. ఇక ఈ ఐపీఎల్లో రైజింగ్ స్టార్స్ గురించి కూడా గంగూలీ స్పందించాడు. ముఖ్యంగా రింకూ సింగ్, ధ్రువ్ జురెల్, యశస్విల గురించి అతడు ప్రస్తావించాడు.

"రింకు సింగ్ బాగా ఆడాడు. ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్ కూడా బాగా ఆడారు. పంజాబ్ కింగ్స్ కు జితేష్ కూడా. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ కూడా బాగా ఆడారు. ఐపీఎల్ చాలా పెద్ద టోర్నీ. వాళ్లు అద్బుతంగా ఆడారు" అని గంగూలీ అన్నాడు.

గంగూలీ క్రికెట్ డైరెక్టర్ గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ 14 మ్యాచ్ లలో 10 ఓడిపోయింది. కేవలం నాలుగు మాత్రమే గెలిచి 9వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ టీమ్ కు రికీ పాంటింగ్ హెడ్ కోచ్ గా ఉన్నాడు. ఇద్దరు లెజెండరీ క్రికెటర్లు సపోర్ట్ స్టాఫ్ లో ఉన్నా కూడా డీసీ మాత్రం లీగ్ స్టేజ్ లోనే వెనుదిరగడం అభిమానులకు మింగుడు పడటం లేదు.

సంబంధిత కథనం