Team India new kit: టీమిండియా కొత్త ట్రైనింగ్ కిట్ చూశారా.. అడిడాస్ వచ్చేసింది
Team India new kit: టీమిండియా కొత్త ట్రైనింగ్ కిట్ చూశారా? కొత్త కిట్ స్పాన్సర్ అడిడాస్ లోగోతో వచ్చిన ట్రైనింగ్ కిట్ ను గురువారం (మే 25) బీసీసీఐ లాంచ్ చేసింది.
Team India new kit: టీమిండియా కొత్త ట్రైనింగ్ కిట్ వచ్చేసింది. ఈ మధ్యే అడిడాస్ కంపెనీని తమ కొత్త స్పాన్సర్ గా అనౌన్స్ చేసిన బీసీసీఐ.. తాజాగా గురువారం (మే 25) ట్రైనింగ్ కిట్ ను ఆవిష్కరించింది. ఈ కొత్త జెర్సీల్లోనే ఇంగ్లండ్ వెళ్లిన తొలి బ్యాచ్ డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ప్రాక్టీస్ చేస్తోంది. పేస్ బౌలర్లు ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ తోపాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఇతర సపోర్ట్ స్టాఫ్ ఈ కొత్త ట్రైనింగ్ కిట్స్ లో కనిపించారు.
ఆస్ట్రేలియాతో జూన్ 7 నుంచి ఇంగ్లండ్ లోని ఓవల్ లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే కొందరు ప్లేయర్స్ ఇంగ్లండ్ వెళ్లిపోయారు. మిగిలిన ప్లేయర్స్ ఐపీఎల్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్ బయలుదేరుతారు. మరోవైపు టీమిండియా కొత్త కిట్ స్పాన్సర్ అడిడాస్ మార్చి 2028 వరకూ కొనసాగనుంది.
ఇండియా మెన్స్, వుమెన్స్, అండర్ 19 టీమ్స్ కు జెర్సీలు, కిట్స్, ఇతర సామగ్రిని అడిడాస్ అందించనుంది. ప్రస్తుతం కిల్లర్ జీన్స్ ఇండియన్ టీమ్ కిట్ స్పాన్సర్ గా ఉంది. మే 31తో వాళ్ల ఒప్పందం ముగుస్తుంది. ఆ తర్వాత అడిడాస్ డీల్ ప్రారంభమవుతుంది. ఈ కొత్త జెర్సీల్లోనే టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో బరిలోకి దిగుతుంది.
జూన్ 7 నుంచి 11వ తేదీ వరకూ ఈ ఫైనల్ జరగనుంది. 2021లో జరిగిన తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లోనూ ఇండియా తలపడిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ తో జరిగిన ఆ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ ఓడిపోయింది. ఈసారి సొంతగడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను 2-1తో ఓడించిన తర్వాత మరోసారి అదే టీమ్ తో ఫైనల్లో తలపడనుండటంతో ఇందులో రోహిత్ సేన ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.
సంబంధిత కథనం