Kohli Fans Troll Ganguly: గంగూలీని ట్రోల్ చేస్తోన్న కోహ్లి ఫ్యాన్స్ - కార‌ణం ఇదే-virat kohli fans troll sourav ganguly details here ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Virat Kohli Fans Troll Sourav Ganguly Details Here

Kohli Fans Troll Ganguly: గంగూలీని ట్రోల్ చేస్తోన్న కోహ్లి ఫ్యాన్స్ - కార‌ణం ఇదే

HT Telugu Desk HT Telugu
May 23, 2023 11:19 AM IST

Kohli Fans Troll Ganguly: టీమ్ ఇండియా మాజీ క్రికెట‌ర్ గంగూలీని కోహ్లి ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తోన్నారు. అందుకు కార‌ణం ఏమిటంటే...

సౌర‌భ్ గంగూలీ,
సౌర‌భ్ గంగూలీ,

Kohli Fans Troll Ganguly: బీసీసీఐ మాజీ అధ్య‌క్షుడు సౌర‌భ్ గంగూలీ, టీమ్ ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు విరాట్ కోహ్లి మ‌ధ్య ఉన్న విభేదాలు ఐపీఎల్‌లో బ‌య‌ట‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సౌర‌భ్ గంగూలీకి షేక్ హ్యాండ్ ఇవ్వ‌డానికి కోహ్లి విముఖత చూపించ‌డం హాట్‌టాపిక్‌గా మారింది.

ట్రెండింగ్ వార్తలు

ఇటీవ‌ల గుజ‌రాత్ టైటాన్స్‌, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు మ‌ధ్య జ‌రిగిన చివ‌రి ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో కోహ్లితో పాటు గిల్ సెంచ‌రీలు సాధించిన సంగ‌తి తెలిసిందే. అయితే గిల్‌ను ప్ర‌శంసిస్తూ సోమ‌వారం గంగూలీ చేసిన ట్వీట్ కోహ్లి ఫ్యాన్స్ ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది. గిల్ రూపంలోప్ర‌తిభావంతుడైన ఆట‌గాడు ఇండియాకు దొరికాడ‌ని పేర్కొన్నాడు.

ఐపీఎల్ స్టాండ‌ర్స్ అద్భుత‌మంటూ ప్ర‌శంసించాడు. గిల్‌ను ఆకాశానికి ఎత్తిన గంగూలీ ఇదే మ్యాచ్‌లో సెంచ‌రీ సాధించిన కోహ్లి పేరును మాత్రం ట్విట్‌లో ప్ర‌స్తావించ‌లేదు. దాంతో కోహ్లి ఫ్యాన్స్ గంగూలీని దారుణంగా ట్రోల్ చేస్తోన్నారు. శుభ్‌మ‌న్‌కు స్ఫూర్తిగా నిలిచిన కోహ్లి గురించి దాదా చెప్ప‌డం మ‌ర్చిపోయాడ‌ని కోహ్లి ఫ్యాన్స్ అంటోన్నారు.

కోహ్లి ప‌ట్ల గంగూలీలో ఉన్న అసూయ ద్వేషానికి ఇది నిద‌ర్శ‌న‌మ‌ని ఓ నెటిజ‌న్ గంగూలీ ట్వీట్‌ను ఉద్దేశించి కామెంట్ చేశాడు. కోహ్లి పేరును మాత్ర‌మే విస్మ‌రించ‌వ‌చ్చు కానీ అత‌డి ఘ‌న‌త‌ల్ని, సెంచ‌రీల‌ను ఎవ‌రూ చెరిపివేయ‌లేర‌ని మ‌రో నెటిజ‌న్ పేర్కొన్నాడు. కోహ్లి కూడా సెంచ‌రీ సాధించాడ‌ని అత‌డి పేరును కూడా గంగూలీ ట్వీట్‌లో పేర్కొంటే బాగుండేద‌ని మ‌రో నెటిజ‌న్ అన్నాడు.

నెటిజ‌న్ల ట్వీట్స్‌, కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి. గంగూలీ బీసీసీఐ అధ్య‌క్షుడిగా ఉన్న స‌మ‌యంలోనే కోహ్లి టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు. ఆ స‌మ‌యంలో ఫామ్ లేమితో కోహ్లిని బ‌ల‌వంతంగా కెప్టెన్ ప‌ద‌వి నుంచి గంగూలీ త‌ప్పించాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది.

WhatsApp channel

టాపిక్