తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ganguly On Dhoni: ఎలా గెలవాలో ధోనీ, సీఎస్కే చూపించింది: గంగూలీ

Ganguly on Dhoni: ఎలా గెలవాలో ధోనీ, సీఎస్కే చూపించింది: గంగూలీ

Hari Prasad S HT Telugu

25 May 2023, 21:39 IST

    • Ganguly on Dhoni: ఎలా గెలవాలో ధోనీ, సీఎస్కే చూపించిందని అన్నాడు గంగూలీ. తొలి క్వాలిఫయర్ లో సీఎస్కే.. గుజరాత్ టైటన్స్ పై గెలిచిన తర్వాత దాదా ఈ కామెంట్స్ చేయడం విశేషం.
ఎమ్మెస్ ధోనీ, సౌరవ్ గంగూలీ
ఎమ్మెస్ ధోనీ, సౌరవ్ గంగూలీ (PTI)

ఎమ్మెస్ ధోనీ, సౌరవ్ గంగూలీ

Ganguly on Dhoni: చెన్నై సూపర్ కింగ్స్, ఆ టీమ్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ. పెద్ద మ్యాచ్ లను ఎలా గెలవాలో సీఎస్కే, ధోనీ చూపించారని దాదా అన్నాడు. గతేడాది దారుణంగా 9వ స్థానంలో ముగించిన సీఎస్కే.. ఈ ఏడాది అద్భుతంగా పుంజుకొని రికార్డు స్థాయిలో పదోసారి ఐపీఎల్ ఫైనల్ చేరిన విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

అదే సమయంలో గంగూలీ క్రికెట్ డైరెక్టర్ గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఈసారి 9వ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో సీఎస్కే సక్సెస్ పై దాదా ఈ కామెంట్స్ చేయడం ఆసక్తి రేపింది. ఇండియా టుడేతో మాట్లాడిన అతడు.. ధోనీ కెప్టెన్సీపై ప్రశంసలు కురిపించాడు.

"చెన్నై సూపర్ కింగ్స్, ధోనీ అద్భుతం. పెద్ద మ్యాచ్ లను ఎలా గెలవాలో వాళ్లు చూపించారు. తన కెప్టెన్సీలో ధోనీకి తిరుగులేదు. అతడు కూడా పెద్ద మ్యాచ్ లను ఎలా గెలవాలో చూపించాడు" అని గంగూలీ అన్నాడు. ఇక ఈ ఐపీఎల్లో రైజింగ్ స్టార్స్ గురించి కూడా గంగూలీ స్పందించాడు. ముఖ్యంగా రింకూ సింగ్, ధ్రువ్ జురెల్, యశస్విల గురించి అతడు ప్రస్తావించాడు.

"రింకు సింగ్ బాగా ఆడాడు. ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్ కూడా బాగా ఆడారు. పంజాబ్ కింగ్స్ కు జితేష్ కూడా. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ కూడా బాగా ఆడారు. ఐపీఎల్ చాలా పెద్ద టోర్నీ. వాళ్లు అద్బుతంగా ఆడారు" అని గంగూలీ అన్నాడు.

గంగూలీ క్రికెట్ డైరెక్టర్ గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ 14 మ్యాచ్ లలో 10 ఓడిపోయింది. కేవలం నాలుగు మాత్రమే గెలిచి 9వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ టీమ్ కు రికీ పాంటింగ్ హెడ్ కోచ్ గా ఉన్నాడు. ఇద్దరు లెజెండరీ క్రికెటర్లు సపోర్ట్ స్టాఫ్ లో ఉన్నా కూడా డీసీ మాత్రం లీగ్ స్టేజ్ లోనే వెనుదిరగడం అభిమానులకు మింగుడు పడటం లేదు.