తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ian Chappell On Ind Vs Aus: ఇండియాను ఆస్ట్రేలియా ఓడించడం దాదాపు అసాధ్యం: ఇయాన్ ఛాపెల్

Ian Chappell on IND vs AUS: ఇండియాను ఆస్ట్రేలియా ఓడించడం దాదాపు అసాధ్యం: ఇయాన్ ఛాపెల్

Hari Prasad S HT Telugu

30 January 2023, 17:04 IST

    • Ian Chappell on IND vs AUS: ఇండియాను వాళ్ల సొంత దేశంలో ఆస్ట్రేలియా ఓడించడం దాదాపు అసాధ్యమని అన్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్. ఇండియన్ టీమ్ లోని టాప్ 3 బ్యాటర్లకు కూడా కీలకమైన సూచన చేశాడు.
ఇండియా, ఆస్ట్రేలియా సిరీస్ పై ఇయాన్ ఛాపెల్ విశ్లేషణ
ఇండియా, ఆస్ట్రేలియా సిరీస్ పై ఇయాన్ ఛాపెల్ విశ్లేషణ (Getty Images)

ఇండియా, ఆస్ట్రేలియా సిరీస్ పై ఇయాన్ ఛాపెల్ విశ్లేషణ

Ian Chappell on IND vs AUS: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరి 9 నుంచి నాలుగు టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగనున్న విషయం తెలుసు కదా. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టేబుల్లో టాప్ లో ఉన్న ఆస్ట్రేలియాకు ఇది నిజంగా సవాలే. 2004 తర్వాత ఇండియాలో ఆ టీమ్ సిరీస్ గెలవలేకపోయింది. ఈసారి కూడా ఇండియాను వాళ్ల సొంత దేశంలో ఓడించడం దాదాపు అసాధ్యమని అంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ ఛాపెల్.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

క్రికిన్ఫోకు రాసిన కాలమ్ లో ఇయాన్ ఇండియన్ టీమ్ కు కీలకమైన సూచనలు కూడా చేశాడు. ఆస్ట్రేలియాకు ఇది ఎవరెస్ట్ పర్వతం ఎక్కడంలాంటిదే అని ఛాపెల్ అన్నాడు. ఆస్ట్రేలియా పిచ్ లపై టీమ్ నిలకడగా రాణించినా, పూర్తి భిన్నంగా ఉండే ఇండియన్ పిచ్ లపై ఎలా ఆడతారన్నది చూడాలని ఛాపెల్ అన్నాడు. ఇప్పుడున్న ఆస్ట్రేలియా టీమ్ లో ఒక్క స్టీవ్ స్మిత్ సగటు మాత్రమే ఇండియాలో 30 కంటే ఎక్కువగా ఉన్న విషయాన్ని కూడా ఛాపెల్ గుర్తు చేశాడు.

"ఆస్ట్రేలియా బ్యాటర్లకు ఇది సవాలే. ముఖ్యంగా అశ్విన్ తో కలిసి జడేజా అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. కానీ ఆస్ట్రేలియా టీమ్ లో మాత్రం కేవలం నేథన్ లయన్ మాత్రమే ఉన్నాడు. అతని సగటు కూడా ఇండియాలో 30కిపైగా ఉంది. లయన్ పై మానసికంగా పైచేయి సాధించడమే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, పుజారాలాంటి వాళ్లు చేయాల్సింది. ఒకవేళ ఆస్ట్రేలియా టీమ్ కోరుకున్నట్లు లయన్ రాణించలేకపోతే ఆ టీమ్ తమ బిగ్ త్రీపై ఆధారపడుతుంది" అని ఛాపెల్ అన్నాడు.

అయితే ఈ బిగ్ త్రీ అయిన ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ ల సగటు కూడా ఇండియాలో 30కిపైగానే ఉందన్న విషయాన్ని కూడా అతడు గుర్తు చేశాడు. ఇక ఇండియాకు కూడా రిషబ్ పంత్ స్థానంలో వచ్చే ప్లేయర్ తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నదని అన్నాడు.

ఇక ఆస్ట్రేలియా బ్యాటింగ్ మొత్తం ఆధార పడే స్టీవ్ స్మిత్ ను అడ్డుకుంటే ఇండియా సులువుగా గెలుస్తుందని ఛాపెల్ అభిప్రాయపడ్డాడు. "భారీ స్కోర్లు చేసే స్మిత్ ను అడ్డుకోవడమే ఇండియన్ బౌలర్ల ముందున్న ప్రధాన సవాలు. ఒకవేళ స్మిత్ తో పాటు లయన్ ను కూడా ఇండియా అడ్డుకుంటే మాత్రం సులువుగా మ్యాచ్ లు గెలుస్తారు" అని ఛాపెల్ అన్నాడు.