తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ganguly On Hardik: కోహ్లి, పుజారాలను పక్కన పెట్టొద్దు.. హార్దిక్ పాండ్యా టెస్ట్ క్రికెట్ ఆడాలి: గంగూలీ

Ganguly on Hardik: కోహ్లి, పుజారాలను పక్కన పెట్టొద్దు.. హార్దిక్ పాండ్యా టెస్ట్ క్రికెట్ ఆడాలి: గంగూలీ

Hari Prasad S HT Telugu

14 June 2023, 11:17 IST

google News
    • Ganguly on Hardik: కోహ్లి, పుజారాలను పక్కన పెట్టొద్దు.. హార్దిక్ పాండ్యా టెస్ట్ క్రికెట్ ఆడాలి అని అన్నాడు సౌరవ్ గంగూలీ. ఒక్క ఫైనల్ ఓడిపోయినంత మాత్రాన ఇండియన్ టీమ్ ను తీసిపారేయొద్దని స్పష్టం చేశాడు.
సౌరవ్ గంగూలీ
సౌరవ్ గంగూలీ (AFP)

సౌరవ్ గంగూలీ

Ganguly on Hardik: ఐసీసీ ట్రోఫీ గెలవాలన్న పదేళ్ల కల మరోసారి కలగానే మిగిలిపోయింది. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇండియా మళ్లీ ఓడిపోయింది. అయితే ఈ ఓటమితో ఇండియన్ టీమ్ ను తీసిపారేయొద్దని, ముఖ్యంగా కోహ్లి, పుజారాలాంటి వాళ్లను పక్కన పెట్టొద్దని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సూచించాడు. అంతేకాదు హార్దిక్ టెస్ట్ క్రికెట్ ఆడాలని కూడా చెప్పాడు.

ఇండియా టుడేతో గంగూలీ మాట్లాడాడు. "ఒక్క ఓటమితో అంతా అయిపోయిందని అనుకోవడం సరికాదు. ఇండియా దగ్గర ఎప్పుడూ టాలెంట్ ఉంది. విరాట్ లేదా పుజారాలను పక్కన పెట్టాలన్న ఆలోచనకు ఇది సరైన సమయం కాదు. విరాట్ కు ఇంకా 34 ఏళ్లే" అని గంగూలీ అన్నాడు.

"ఇండియా దగ్గర ఎంతో మంది ప్లేయర్స్ ఉన్నారు. ఇప్పటికే కొందరి ఆటను గమనించింది. టెస్ట్ క్రికెట్ కాబట్టి ఐపీఎల్ ప్రదర్శనను నేను పట్టించుకోను. దేశవాళీ క్రికెట్ లో కొందరు అద్భుతమైన ప్లేయర్స్ ఉన్నారు. వాళ్లకు అవకాశాలు ఇవ్వాలి. అది జైస్వాల్ లేదా పటీదార్ కావచ్చు. బెంగాల్ నుంచి అభిమన్యు ఈశ్వరన్ బాగా రన్స్ చేస్తున్నాడు. శుభ్‌మన్ గిల్ ఇంకా యువకుడు, రుతురాజ్ కూడా. హార్దిక్ పాండ్యా వింటున్నాడని అనుకుంటున్నాను. అతడు టెస్ట్ క్రికెట్ ఆడాలని భావిస్తున్నాను. ముఖ్యంగా ఇలాంటి కండిషన్స్ లో" అని గంగూలీ చెప్పాడు.

2018 ఆసియా కప్ లో వెన్ను గాయానికి గురైన తర్వాత పాండ్యా మళ్లీ టెస్ట్ క్రికెట్ ఆడలేదు. 2022 ఐపీఎల్ తో మరోసారి తన ఆల్ రౌండర్ పాత్రకు న్యాయం చేస్తున్నా.. పరిమిత ఓవర్ల క్రికెట్ కే పాండ్యా పరిమితమయ్యాడు. గతేడాది ఇండియన్ టీమ్ కు కొన్ని టీ20లు, వన్డేల్లోనూ కెప్టెన్ గా ఉన్నాడు. అయితే టెస్ట్ క్రికెట్ ఆడేంత ఫిట్‌నెస్ ఇంకా తాను సాధించలేదని అతడు చెబుతున్నాడు.

పాండ్యా ఇప్పటి వరకూ 11 టెస్టులు ఆడి 532 రన్స్ చేశాడు. అందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్ లో 17 వికెట్లు తీసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ లో ఆడేంత సత్తా తిరిగి సంపాదించిన తర్వాతే దాని గురించి ఆలోచిస్తానని ఈ మధ్య హార్దిక్ చెప్పాడు.

తదుపరి వ్యాసం