Rinku Singh: వెస్టిండీస్ టూర్‌కు సీనియ‌ర్స్ దూరం - రింకు సింగ్‌, య‌శ‌స్వి జైస్వాల్‌కు పిలుపు?-ind vs wi series rinku singh yashasvi jaiswal and others ipl start likely to be selected for west indies tour ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ind Vs Wi Series Rinku Singh Yashasvi Jaiswal And Others Ipl Start Likely To Be Selected For West Indies Tour

Rinku Singh: వెస్టిండీస్ టూర్‌కు సీనియ‌ర్స్ దూరం - రింకు సింగ్‌, య‌శ‌స్వి జైస్వాల్‌కు పిలుపు?

HT Telugu Desk HT Telugu
Jun 06, 2023 06:30 AM IST

Rinku Singh: ఐపీఎల్‌లో అద‌ర‌గొట్టిన రింకు సింగ్‌, జితేన్ శ‌ర్మ త్వ‌ర‌లోనే టీమ్ ఇండియాలోకి అరంగేట్రం చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. జూలైలో వెస్టిండీస్‌తో మొద‌లుకానున్న వ‌న్డే, టీ20 సిరీస్‌లో ప‌లువురు ఐపీఎల్ స్టార్స్‌కు చోటు ద‌క్కే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. .

రింకు సింగ్‌
రింకు సింగ్‌

Rinku Singh: ఐపీఎల్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారించిన యంగ్ క్రికెట‌ర్స్ త్వ‌ర‌లోనే టీమ్ ఇండియాలోకి అరంగేట్రం చేయ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. ఐపీఎల్ ధ‌నాధాన్ బ్యాటింగ్‌తో మెరిసిన రింకు సింగ్‌, య‌శ‌స్వి జైస్వాల్‌, జితేన్ శ‌ర్మ‌తోటీమ్ ఇండియాలోకి రాబోతున్న‌ట్లు స‌మాచారం. జూలై - ఆగ‌స్ట్‌లో వెస్టిండీస్‌తో టీమ్ ఇండియా టీ20, వ‌న్డే సిరీస్ ఆడ‌నుంది.

ట్రెండింగ్ వార్తలు

ఈ సిరీస్ కోసం సీనియ‌ర్ ప్లేయ‌ర్స్ రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లి, అశ్విన్‌ల‌కు సెలెక్ట‌ర్లు విశ్రాంతినివ్వ‌బోతున్న‌ట్లు తెలిసింది. ఈ వెస్టిండీస్ టూర్‌కు హార్దిక్ పాండ్య కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. సూర్య‌కుమార్ యాద‌వ్ వైస్ కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న‌ట్లు చెబుతోన్నారు. ఐపీఎల్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్న రింకు సింగ్‌, య‌శస్వి జైస్వాల్‌ల‌కు వ‌న్డే, టీ20 జ‌ట్టులో చోటు ద‌క్క‌నున్న‌ట్లు తెలుస్తోంది.

అలాగే ఐపీఎల్‌లో బ్యాటింగ్‌, వికెట్ కీపింగ్‌లో అద‌ర‌గొట్టిన పంజాబ్ కింగ్స్ ఆట‌గాడు జితేన్ శ‌ర్మ‌ను వెస్టిండీస్ టూర్ కోసం ఎంపిక‌చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ ద్వారా మ‌రో ఐపీఎల్ స్టార్ మోహిత్ శ‌ర్మ కూడా టీమ్ ఇండియాలోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

వీరితో పాటు ఐపీఎల్‌లో రాణించిన శివ‌మ్‌మావి, రాహుల్ త్రిపాఠి, తుషార్ దేశ్‌పాండ్ పేర్ల‌ను సెలెక్ట‌ర్లు ప‌రిశీల‌న‌లోకి తీసుకుంటున్న‌ట్లు చెబుతోన్నారు. వ‌చ్చే ఏడాది జ‌రుగ‌నున్న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ను దృష్టిలో పెట్టుకొనే యంగ్ ప్లేయ‌ర్స్‌కు ఎక్కువ‌గా అవ‌కాశాలు ఇవ్వాల‌నే ఆలోచ‌న‌లో బీసీసీఐ ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తోన్నాయి

WhatsApp channel