Hyundai Exter SUV : హ్యుందాయ్​ కొత్త ఎస్​యూవీకి బ్రాండ్​ అంబాసిడర్​గా హార్దిక్​ పాండ్యా-hardik pandya roped in as brand ambassador for hyundai exter suv see details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai Exter Suv : హ్యుందాయ్​ కొత్త ఎస్​యూవీకి బ్రాండ్​ అంబాసిడర్​గా హార్దిక్​ పాండ్యా

Hyundai Exter SUV : హ్యుందాయ్​ కొత్త ఎస్​యూవీకి బ్రాండ్​ అంబాసిడర్​గా హార్దిక్​ పాండ్యా

Sharath Chitturi HT Telugu
Jun 12, 2023 02:20 PM IST

Hyundai Exter SUV brand ambassador : ప్రముఖ క్రికెటర్​ హార్దిక్​ పాండ్యాను ఎక్స్​టర్​ ఎస్​యూవీకి బ్రాండ్​ అంబాసిడర్​గా ఎంపిక చేసుకుంది హ్యుందాయ్​ సంస్థ. త్వరలోనే ఈ ఎస్​యూవీ ఇండియాలో లాంచ్​కానుంది.

హ్యుందాయ్​ కొత్త ఎస్​యూవీకి బ్రాండ్​ అంబాసిడర్​గా హార్దిక్​ పాండ్యా
హ్యుందాయ్​ కొత్త ఎస్​యూవీకి బ్రాండ్​ అంబాసిడర్​గా హార్దిక్​ పాండ్యా (HT AUTO)

Hardik Pandya Hyundai Exter SUV : హ్యుందాయ్​ మోటార్​ ఇండియా మంచి జోరు మీద ఉంది. కొత్త ఎస్​యూవీ ఎక్స్​టర్​ను జులై 10న లాంచ్​ చేసేందుకు సిద్ధమవుతున్న హ్యుందాయ్​ సంస్థ.. మరో పెద్ద ప్లానే వేసింది. ఇందులో భాగంగా ప్రముఖ క్రికెటర్​ హార్దిక్​ పాండ్యాను ఎక్స్​టర్​ ఎస్​యూవీకి బ్రాండ్​ అంబాసిడర్​గా నియమించింది.

క్రేజ్​, సేల్స్​ పెంచుకోవాలని..!

హ్యుందాయ్​ ఎక్స్​టర్​ను జెన్​ జెడ్​ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా తయారు చేసినట్టు ఇప్పటికే అనేకమార్లు చెప్పింది సంస్థ. ఇక ఇప్పుడు.. హార్దిక్​ పాండ్యాను బ్రాండ్​ అంబాసిడర్​గా ఎంపిక చేసుకుంది. ఈ గుజరాత్​ టైటాన్స్​ కెప్టెన్​కు యువతలో మంచి ఫాలోయింగ్​ ఉంది. ఈ ఫాలోయింగ్​తో ఎక్స్​టర్​ సేల్స్​ను పెంచుకోవాలని హ్యుందాయ్​ అభిప్రాయపడుతోంది.

"హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఇమేజ్​ను మరో స్థాయికి తీసుకెళ్లాలని మాకు ఉంది. ఈ పనికి హార్దిక్​ పాండ్యా తప్ప ఇంకెవ్వరు సరిపోరు. ఈ తరం క్రికెట్​ చరిత్రలో అత్యంత ప్రతిభావంతమైన క్రికెటర్​గా పాండ్యాకు గుర్తింపు ఉంది," అని హ్యుందాయ్​ మోటార్​ ఇండియా సీఓఓ తరుణ్​ గర్గ్​ తెలిపారు.

ఇదీ చూడండి:- Honda Elevate SUV : ఇదిగో.. హోండా ఎలివేట్​ ఎస్​యూవీ- అదిరిన ఫీచర్స్​!

ఎక్స్​టర్​ ఇలా ఉంటుంది..!

Hyundai Exter SUV price : లాంచ్​ డేట్​ సమీపిస్తున్న కొద్ది.. వెహికిల్​కు సంబంధించిన టీజర్​లను ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ వస్తోంది హ్యుందాయ్​ సంస్థ. వీటి ద్వారా ఎస్​యూవీలో ఉండే కొన్ని ఫీచర్స్​పై క్లారిటీ వచ్చింది. డ్యూయెల్​ కెమెరాలు ఉన్న డాష్​కామ్​, స్మార్ట్​ ఎలక్ట్రిక్​ సన్​రూఫ్​ వంటివి ఇందులో ఉంటాయి. వాయిస్​ కమాండ్స్​తో ఈ సన్​రూఫ్​ను ఆపరేట్​ చేసే ఫీచర్​ కూడా ఈ ఎక్స్​టర్​ ఎస్​యూవీలో ఉన్నట్టు తెలుస్తోంది. 'ఓపెన్​ సన్​రూఫ్​', 'ఐ వాంట్​ టు సీ ది స్కై (నాకు ఆకాశాన్ని చూడాలని ఉంది)' అని కొన్ని కమాండ్స్​ ఇస్తే.. సన్​రూఫ్​ ఓపెన్​ అవుతుందని సమాచారం. అయితే ఇది కేవలం టాప్​ ఎండ్​ వేరియంట్​కే అందుబాటులో ఉండొచ్చు.

హ్యుందాయ్​ ఎక్స్​టర్​లో 1.2 లీటర్​ నేచురల్లీ ఆస్పిరేటెడ్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఈ ఇంజిన్​ 82 బీహెచ్​పీ పవర్​ను, 114 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్​ మేన్యువల్​, 5 స్పీడ్​ ఏఎంటీ గేర్​బాక్స్​ ఆప్షన్స్​ ఉండనున్నాయి. సీఎన్​జీ ఆప్షన్​ కూడా లభించొచ్చు.

Hyundai Exter SUV specifications : హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీ స్పెసిఫికేషన్స్​, ఫీచర్స్​, ధర వంటి వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. లాంచ్​ టైమ్​కి వీటిపై ఓ క్లారిటీ వస్తుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం