Honda Elevate SUV : ఇదిగో.. హోండా ఎలివేట్ ఎస్యూవీ- అదిరిన ఫీచర్స్!
Honda Elevate SUV : హోండా ఎలివేట్ ఎస్‌యూవీని సంస్థ మంగళవారం ఆవిష్కరించింది. ఈ మోడల్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధర వంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..
Honda Elevate SUV : ఈ ఏడాది మచ్ అవైటెడ్ వాహనాల్లో ఒకటైన ఎలివేట్ ఎస్‌యూవీని మంగళవారం అధికారికంగా ఆవిష్కరించింది హోండా కార్స్ ఇండియా. జులై నుంచి బుకింగ్స్ ఓపెన్ అవుతాయని, పండుగ సీజన్లో ఎలివేట్ లాంచ్ అవుతుందని స్పష్టం చేసింది. తొలుత దేశీయ మార్కెట్లోకి ఈ మోడల్ అందుబాటులోకి వస్తుందని, అనంతరం అంతర్జాతీయ విపణీలోకి అడుగుపెడుతుందని పేర్కొంది.
హోండా ఎలివేట్ ఎస్యూవీ.. ఇదిగో!
ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్‌యూవీలకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తోంది. హోండాకు మాత్రం ఈ సెగ్మెంట్లో వాహనాలు లేవు. గతంలో కొన్ని మోడల్స్‌ను లాంచ్ చేసినప్పటికీ, అవి క్లిక్ అవ్వకపోవడంతో డిస్కంటిన్యూ చేసింది ఆటోమొబైల్ సంస్థ. ఈ నేపథ్యంలో పక్కా ప్రణాళికతో ఈసారి ఎలివేట్ ఎస్‌యూవీని తీసుకొచ్చింది. పైగా.. తొలుత ఇండియాలో లాంచ్ చేస్తుండటంతో, దేశంలో ఈ వాహనంపై సంస్థ పెట్టుకున్న అంచనాలు స్పష్టమవుతున్నాయి.
ఇక ఎలివేట్ విషయానికొస్తే.. దీని లుక్స్ డాషింగ్‌గా ఉన్నాయి. హెడ్‌ల్యాంప్స్ షార్ప్‌గా ఉన్నాయి. ఫ్రెంట్లో పెద్ద రేడియేటర్ గ్రిల్ వస్తోంది. ఫ్లాట్ ఫేస్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఇంటిగ్రేచటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఎల్ఈడీ టెయిల్‌లైట్స్, బ్లాక్ ఫాగ్ ల్యాంప్ హోజింగ్, అలాయ్ వల్స్ వంటివి వస్తున్నాయి. సైడ్ ప్రొఫైల్ కూడా అట్రాక్టివ్‌గా ఉంది. గ్లోబల్ అర్బన్ ఎస్‌యూవీగా గుర్తింపు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ ఎస్యూవీ డిజైన్‌పై అధికంగా దృష్టిపెట్టినట్టు సంస్థ చెబుతోంది.
హోండా ఎలివేట్ ఎస్యూవీ పొడవు 4,312ఎంఎం. వెడల్పు 1,790ఎంఎం. ఎత్తు 1,650ఎంఎం. ఈ డైమెన్షన్స్‌తో ఎస్యూవీ కంఫ్టర్ చాలా మెరుగ్గా ఉంటుందని సంస్థ చెబుతోంది. రోడ్ ప్రెజెన్స్ కూడా బలంగా ఉంటుందని అంచనా వేస్తోంది.
హోండా ఎలివేట్- ఫీచర్స్.. ఇంజిన్..
ఇక ఫీచర్స్ విషయానికొస్తే.. ఈ వెహికిల్‌లో 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, 7 ఇంచ్ హెచ్డీ కలర్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వయర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్ టెక్నాలజీ, హోండా కనెక్ట్ వంటివి లభిస్తున్నాయి. జియో ఫెన్సింగ్, ఎమర్జెన్సీ అసిస్టెన్స్ వంటివి కూడా వస్తున్నాయి.
Honda Elevate launch date India : ఎస్యూవీ సేఫ్టీపైనా హోండా అధిక దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. కొలిజన్ మైగ్రేషన్ బ్రేకింగ్, లేన్ కీపింగ్ అసిస్టెన్స్, పెడిస్ట్రిషన్ ఇంజ్యూరీ మిటిగేషన్ సిస్టెమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్- కెమెరా, హోండా సెన్స్ అండ్ ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ వంటివి సేఫ్టీ ఫీచర్స్‌గా వస్తున్నాయి. వీటిని దాటుకుని ఏమైనా ప్రమాదం జరిగితే.. తక్కువ ఇంపాక్ట్ పడే విధంగా ఈ వెహికిల్ బాడీని టెన్సైల్ స్టీల్ మెటీరియల్‌తో రూపొందించింది ఈ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ.
హోండా ఎలివేట్‌లో 1.5 లీటర్ డీఓహెచ్సీ ఐ- వీటెక్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 121 పీఎస్ పవర్‌ను, 145.1 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మేనయువల్ గేర్‌బాక్స్‌తో పాటు అడ్వాన్స్డ్ సీవీటీ ట్రాన్స్మిషన్ లభిస్తోంది. సెల్ఫ్ ఛార్జింగ్, డ్యూయెల్ మోటార్ ఈ-సీవీటీ టెక్నాలజీతో కూడిన స్ట్రాంగ్ హైబ్రీడ్ వేరియంట్ కూడా ఈ ఎస్‌యూవీకి లభిస్తుందని తెలుస్తోంది. ఇది 126 పీఎస్ పవర్‌ను, 253ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
ధర ఎంత..?
Honda Elevate features : ఇండియాలో ఈ ఎలివేట్ ఎస్యూవీ ధరకు సంబంధించిన వివరాలు లాంచ్ సమయంలో తెలుస్తాయి. అయితే దీని ఎక్స్‌షోరూం ధర రూ. 10.50లక్షలు- రూ. 20లక్షల మధ్యలో ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా లాంచ్ తర్వాత.. ఈ వెహికల్ ఇప్పటికే మార్కెట్లో హై డిమాండ్ ఉన్న హ్యుందాయ్ క్రేటా, కియా సెల్టోస్, మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా, స్కోడా కుషాక్, వోక్స్వ్యాగన్ టైగున్, ఎంజీ ఆస్టర్‌కు గట్టిపోటీనిస్తుందని అంచనాలు ఉన్నాయి.
ఇండియాలో మరో మూడేళ్లల్లో ఒక ఫుల్లీ ఎలక్ట్రిక్ కారును సైతం లాంచ్ చేయనున్నట్టు హోండా ప్రకటించింది. ఎలివేట్ ఎస్యూవీ ఈవెంట్లో ఈ విషయాన్ని వెల్లడించింది.
సంబంధిత కథనం