Sourav Ganguly: కోహ్లి అలా చేస్తాడని అనుకోలేదు.. వరల్డ్ కప్ కంటే ఐపీఎల్ గెలవడం కష్టం: గంగూలీ
Sourav Ganguly: కోహ్లి అలా చేస్తాడని అనుకోలేదు.. వరల్డ్ కప్ కంటే ఐపీఎల్ గెలవడం కష్టం అంటూ గంగూలీ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇప్పుడతని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Sourav Ganguly: టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దాదా కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. కోహ్లి టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం తమకు ఆశ్చర్యం కలిగించిందని ఆ సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీ అనడం గమనార్హం.
అంతేకాదు వరల్డ్ కప్ కంటే ఐపీఎల్ గెలవడమే కష్టమని కూడా దాదా చెప్పడం విశేషం. ఇక విరాట్ కోహ్లి స్థానంలో కెప్టెన్సీకి రోహితే బెస్ట్ ఆప్షన్ అని కూడా గంగూలీ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ను ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిపిన రోహిత్ విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కూడా అన్నాడు.
"విరాట్ కెప్టెన్సీ వదులుకున్న తర్వాత సెలక్టర్లకు ఓ కెప్టెన్ అవసరం వచ్చింది. ఆ సమయంలో రోహిత్ బెస్ట్ అనిపించాడు. అతడు ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచాడు. అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించాడు. ఆసియా కప్ గెలిచాడు. అతడే బెస్ట్ ఆప్షన్ అనిపించింది. టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ఇండియా ఆడింది. రెండేళ్ల కిందట కూడా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడి ఓడిపోయాం. టీ20 వరల్డ్ కప్ సెమీస్ చేరాం. అందుకే సెలక్టర్లు ఆ బాధ్యతను సరిగ్గా నిర్వహించే వ్యక్తినే ఎంపిక చేశారు" అని ఆజ్ తక్ తో మాట్లాడుతూ గంగూలీ అన్నాడు.
వరల్డ్ కప్ లో సెమీస్ చేరాలంటే నాలుగైదు మ్యాచ్ లు గెలిస్తే చాలని, అదే ఐపీఎల్ గెలవాలంటే 17 మ్యాచ్ లు గెలవాలని ఈ సందర్భంగా గంగూలీ అభిప్రాయపడ్డాడు. "నాకు రోహిత్ పై పూర్తి నమ్మకం ఉంది. అతడు, ధోనీ ఐదేసి ఐపీఎల్ టైటిల్స్ గెలిచారు. ఐపీఎల్ గెలవడం అంత సులువు కాదు. ఎందుకంటే అది కఠినమైన టోర్నీ. వరల్డ్ కప్ గెలవడం కంటే ఐపీఎల్ గెలవడం కష్టం. 14 మ్యాచ్ ల తర్వాత ప్లేఆఫ్స్ చేరుకుంటారు. వరల్డ్ కప్ లో నాలుగైదు మ్యాచ్ లలో గెలిస్తే సెమీస్ వెళ్తారు. ఐపీఎల్లో 17 మ్యాచ్ ల తర్వాత టైటిల్ గెలుస్తారు" అని గంగూలీ అన్నాడు.
సంబంధిత కథనం