Gavaskar on Rohit: ఐపీఎల్‌కు ప్రిపేర్ అయ్యావు కదా.. మరి దీనికేమైంది: రోహిత్‌పై గవాస్కర్ అసహనం
Gavaskar on Rohit: ఐపీఎల్‌కు ప్రిపేర్ అయ్యావు కదా.. మరి దీనికేమైంది అంటూ రోహిత్‌పై గవాస్కర్ అసహనం వ్యక్తం చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ బెస్టాప్ త్రీగా ఉండాలన్న అతని వాదనపై మండిపడ్డాడు.
Gavaskar on Rohit: డబ్ల్యూటీసీ ఫైనల్ బెస్టాఫ్ త్రీగా ఉంటే బాగుంటుంది.. ఇదీ ఈ ఫైనల్లో ఓడిపోయిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన కామెంట్స్. అయితే వీటిపై సునీల్ గవాస్కర్ లాంటి మాజీ క్రికెటర్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఐపీఎల్ కు ప్రిపేర్ అయ్యావు కదా.. దీనికి కూడా ఒకే ఒక ఫైనల్ అన్నట్లుగా ప్రిపేర్ కావాల్సిందే అని అనడం విశేషం.
"లేదు. ఇది చాలా కాలం కిందటే నిర్ణయించారు. ఈ సైకిల్లో తొలి మ్యాచ్ ఆడకముందే ఫైనల్ ఒకే మ్యాచ్ అని చెప్పేశారు. అందువల్ల మీరు దానికి మానసికంగా సిద్ధం కావాలి. అచ్చూ ఐపీఎల్ కు సిద్ధమైనట్లే. బెస్టాఫ్ త్రీ అని అడగకూడదు. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రోజు, రెండు రోజులు కలిసి రావు. కానీ ఈ సైకిల్లో తొలి బంతి పడకముందే దీనిపై నిర్ణయం తీసుకున్నారు. అందువల్ల బెస్టాఫ్ త్రీ అడగనే కూడదు. రేపు బెస్టాఫ్ ఆఫ్ ఫైవ్ కావాలని కూడా అడుగుతారు" అని ఇండియా టుడేతో మాట్లాడుతూ గవాస్కర్ అనడం గమనార్హం.
ఈ డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇండియా ఏకంగా 209 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ఓడిన తర్వాత రోహిత్ మీడియాతో మాట్లాడుతూ.. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం బెస్టాఫ్ త్రీ ఉంటే బాగుంటుందని అన్నాడు. అయితే దీనిపై గవాస్కర్ తోపాటు పలువురు ఇతర మాజీ క్రికెటర్లు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.
2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత మరో ఐసీసీ ట్రోఫీ కోసం ఆశగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఈసారి కూడా నిరాశనే మిగిల్చింది టీమిండియా. దీంతో మరోసారి ఐసీసీ ట్రోఫీ కోసం ఎదురు చూస్తూ ఈ ఏడాది చివర్లో జరగబోయే వరల్డ్ కప్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. అయితే ఆ టోర్నీలో తాము భిన్నంగా ఆడతామని, ఇది కచ్చితంగా గెలవాలన్నట్లుగా కాకుండా ప్లేయర్స్ కు స్వేచ్ఛ ఇస్తామని రోహిత్ చెప్పాడు.
సంబంధిత కథనం