Shubman Gill : ఐపీఎల్ 2024లో గుజరాత్ నుంచి శుభ్‌మన్ గిల్ వైదొలుగుతాడా?-shubman gill may leave gujarat titans in ipl 2024 heres why ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Shubman Gill May Leave Gujarat Titans In Ipl 2024 Here's Why

Shubman Gill : ఐపీఎల్ 2024లో గుజరాత్ నుంచి శుభ్‌మన్ గిల్ వైదొలుగుతాడా?

Anand Sai HT Telugu
Jun 04, 2023 06:39 AM IST

Shubman Gill : గత 4 సీజన్‌లుగా శుభ్‌మన్ గిల్ నిలకడగా రాణిస్తున్నాడు. ఐపీఎల్ 2020లో 440 పరుగులు, 2021లో 478 పరుగులు చేశాడు. 2022లో 483 పరుగులు చేశాడు. ఈసారి 890 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అయితే వచ్చే ఐపీఎల్ లో జట్టు మారుతాడని చర్చ నడుస్తోంది.

శుభ్‌మన్ గిల్‌
శుభ్‌మన్ గిల్‌ (Twitter)

IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16 ముగిసిన తర్వాత, IPL 2024పై చర్చలు ప్రారంభమయ్యాయి. కొన్ని ఫ్రాంచైజీల యజమానులు పేలవ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల, కొంతమంది ఆటగాళ్లు తదుపరి సీజన్‌కు ముందు జట్టు నుండి గేట్ పాస్ పొందుతారు. అయితే కొన్ని ఫ్రాంచైజీలు వచ్చే సీజన్ కోసం స్టార్ ఆటగాళ్లపై కన్నేసి ఉంచాయి. ఈ జాబితాలో శుభ్‌మన్ గిల్ పేరు ప్రముఖంగా ఉంది.

ట్రెండింగ్ వార్తలు

గుజరాత్ టైటాన్స్ తరఫున అద్భుత ప్రదర్శన చేసిన శుభ్‌మన్ గిల్ ఈసారి మొత్తం 890 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్ విజేతగా కూడా నిలిచాడు. ఇప్పుడు గిల్ కోసం కొన్ని ఫ్రాంచైజీలు చూస్తున్నాయి. ఎందుకంటే గత 4 సీజన్‌లుగా శుభ్‌మన్ గిల్ నిలకడగా రాణిస్తున్నాడు. ఐపీఎల్ 2020లో 440 పరుగులు, 2021లో 478 పరుగులు చేశాడు. 2022లో 483 పరుగులు చేశాడు. ఈసారి 890 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.

అయితే గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ శుభ్ మన్ గిల్ కు ఆఫర్ చేసిన మొత్తం రూ.8 కోట్లు మాత్రమే. అంటే గిల్ జీతం ఇతర ఆటగాళ్ల కంటే చాలా తక్కువ. ఎందుకంటే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఇషాన్ కిషన్‌కు రూ.15.25 కోట్లు, మరోవైపు సీఎస్‌కే దీపక్ చాహర్ రూ.14 కోట్లు ఇస్తోంది. అదేవిధంగా శ్రేయాస్ అయ్యర్‌కు కేకేఆర్ రూ.12.25 కోట్లు చెల్లించింది. చెల్లిస్తోంది హర్షల్ పటేల్ RCB నుండి 10.75 కోట్లు పొందుతున్నాడు. శార్దూల్ ఠాకూర్ 10.75 కోట్లు అందుకుంటే.. అవేశ్ ఖాన్ కు రూ.10 కోట్లు పొందుతున్నాడు.

అయితే వరుసగా నాలుగు సీజన్లలో మంచి ప్రదర్శన కనబరుస్తున్న శుభ్‌మన్ గిల్ జీతం ఇప్పటికీ సింగిల్ డిజిట్‌లోనే ఉంది. అందువల్ల, కొన్ని ఫ్రాంచైజీలు అతనిని వచ్చే సీజన్‌లో వేలానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాయి. పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ ఇప్పటికే శుభ్‌మన్ గిల్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెబుతున్నారు. ఎందుకంటే పంజాబ్ జట్టుకు స్టార్ ప్లేయర్ అవసరం. ముఖ్యంగా లోకల్ స్టార్ ప్లేయర్ దొరికితే పంజాబ్ కింగ్స్‌ను వదులుకునే ప్రసక్తే లేదు.

శుభ్‌మన్ గిల్ పంజాబ్‌కు చెందిన క్రికెటర్. అతడిని పిలిచి నాయకత్వం ఇస్తే జట్టులో చరిష్మా పెరుగుతుంది. ఐపీఎల్‌లో సొంత రాష్ట్ర జట్టుకు నాయకత్వం వహించడం ఏ ఆటగాడికైనా గర్వకారణం. రోహిత్ శర్మ ఇప్పటికే తన స్వస్థలం ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా ఉండగా, హార్దిక్ పాండ్యా గుజరాత్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. రోహిత్ శర్మ కంటే ముందు కూడా సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఉన్నాడు.

శుభ్‌మన్ గిల్ గుజరాత్ టైటాన్స్‌ను వీడితే పంజాబ్ కింగ్స్‌లో చేరడం ఖాయమని చెప్పవచ్చు. ఎందుకంటే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మొత్తానికి ఓ ఆటగాడిని కొనుగోలు చేసిన రికార్డు పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీకి దక్కింది. 2023 ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కుర్రాన్‌ను రూ.18.50 కోట్లకు కొనుగోలు చేసింది.

WhatsApp channel