PBKS Vs RR : పంజాబ్‌పై రాజస్థాన్ విజయం.. ప్లేఆఫ్ ఆశలు సజీవం
PBKS Vs RR : పంజాబ్ మీద రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసి విజయం సాధించింది.
డూ ఆర్ డై మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఆ జట్టు 4 వికెట్ల తేడాతో గెలిచి రెండు పాయింట్లు సాధించింది. అయితే ఆర్సీబీని అధిగమించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకడంలో విఫలమైంది.
ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకి దాదాపు ప్లే ఆఫ్ దశకు చేరుకుంది. ప్రస్తుతం ఆర్‌సీబీ, ముంబై జట్ల తదుపరి గెలుపు లేదా ఓటమిపైనే జట్టు భవిష్యత్తు ఆధారపడి ఉంది. పంజాబ్ జట్టు అధికారికంగా లీగ్ నుంచి నిష్క్రమించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించిన రాజస్థాన్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసి విజయం సాధించింది.
భారీ లక్ష్యాన్ని ఛేదించడం ప్రారంభించిన రాజస్థాన్ కు ఆదిలోనే షాక్ తగిలింది. జోస్ బట్లర్ డకౌట్ అయ్యాడు. తద్వారా ప్రస్తుత ఎడిషన్‌లో ఐదోసారి డకౌట్‌గా పేలవమైన రికార్డును లిఖించగా.. జైస్వాల్, పడికల్ హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. అద్భుతంగా బ్యాట్ ఝుళిపించిన పడికల్ హాఫ్ సెంచరీ చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ శాంసన్ రెండు పరుగులు మాత్రమే చేసి నిష్క్రమించాడు.
మరో మంచి ప్రదర్శన ఇచ్చిన జైస్వాల్ అద్భుత అర్ధ సెంచరీ సాధించాడు. కానీ యాభై తర్వాత వికెట్ సమర్పించుకున్నాడు. డెత్ ఓవర్లలో పరాగ్ ఆట 20 పరుగులకే పరిమితమైంది. మరోసారి రెచ్చిపోయిన హెట్మెయర్ 46 పరుగుల విలువైన సహకారం అందించాడు. కానీ శిఖర్ ధావన్ అద్భుత క్యాచ్ కారణంగా వికెట్ కోల్పోయాడు.
ముఖ్యమైన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శిఖర్ ధావన్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టు పోటాపోటీగా స్కోర్ చేసింది. 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేశారు. దీంతో రాజస్థాన్‌కు భారీ టార్గెట్ పెట్టారు.
బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. 2 పరుగులు మాత్రమే చేసి సెంచూరియన్ ప్రభసిమ్రన్ సింగ్ అవుటయ్యాడు. తొలి ఓవర్ లోనే వికెట్ కోల్పోయిన జట్టుకు అథర్వతీడే కాస్త ఆడినట్టుగా కనిపించి.. 19 పరుగులు చేసి సైనీకి వికెట్ అప్పగించాడు. ఆ తర్వాత కెప్టెన్ ధావన్ కూడా జంపా మాయాజాలానికి ఔట్ అయ్యాడు. గత మ్యాచ్‌లో చెలరేగిన లివింగ్‌స్టన్‌కి నవదీప్ సైనీ కూడా కొరకరాని కొయ్యగా మారాడు.
ఈ సమయంలో పేలుడు ఆడిన జితేష్ శర్మ బౌండరీ సిక్సర్ల వర్షం కురిపించాడు. కానీ 44 పరుగులు చేసే సరికి సైనీకి వికెట్ సరెండర్ చేసి హాఫ్ సెంచరీ మార్క్ వద్ద వికెట్ కోల్పోయాడు. ఈ సమయంలో, సామ్ కరణ్, షారుక్ ఖాన్ బాగా ఆడారు. కరణ్ అజేయంగా 49 పరుగులు చేయగా, షారుక్ 41 పరుగులు చేశాడు. వారి ఆట జట్టు స్కోరుకు తోడ్పడింది.