SL vs AFG: శుభ్‌మన్ గిల్ రికార్డు బ్రేక్ చేసిన ఆఫ్ఘన్ బ్యాటర్.. శ్రీలంకకు షాక్-sl vs afg as ibrahim zadran breaks shubhman gill record as visitors beat the hosts ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sl Vs Afg: శుభ్‌మన్ గిల్ రికార్డు బ్రేక్ చేసిన ఆఫ్ఘన్ బ్యాటర్.. శ్రీలంకకు షాక్

SL vs AFG: శుభ్‌మన్ గిల్ రికార్డు బ్రేక్ చేసిన ఆఫ్ఘన్ బ్యాటర్.. శ్రీలంకకు షాక్

Hari Prasad S HT Telugu
Jun 03, 2023 09:22 AM IST

SL vs AFG: శుభ్‌మన్ గిల్ రికార్డు బ్రేక్ చేశాడు ఆఫ్ఘన్ బ్యాటర్. దీంతో తొలి వన్డేలో శ్రీలంకకు షాక్ ఇచ్చింది ఆఫ్ఘనిస్థాన్. శుక్రవారం (జూన్ 2) జరిగిన ఈ మ్యాచ్ లో ఆ టీమ్ 6 వికెట్లతో గెలిచింది.

ఆఫ్ఘనిస్థాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్
ఆఫ్ఘనిస్థాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ (AFP)

SL vs AFG: ఆఫ్ఘనిస్థాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ మన టీమిండియా బ్యాటర్ శుభ్‌మన్ గిల్ రికార్డు బ్రేక్ చేశాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 500 పరుగులు చేసిన బ్యాటర్లలో గిల్ ను వెనక్కి నెట్టి రెండోస్థానానికి చేరాడు. దీంతో తొలి వన్డేలో శ్రీలంకను ఆఫ్ఘన్ టీమ్ 6 వికెట్లతో ఓడించింది. 21 ఏళ్ల జద్రాన్ వన్డేల్లో సంచలనాలు క్రియేట్ చేస్తున్నాడు.

విరాట్ కోహ్లిలాగే 18వ నంబర్ జెర్సీ వేసుకొనే అతడు.. ఆటలోనూ అతన్ని మరిపిస్తున్నాడు. తొలి వన్డేలో 98 పరుగులు చేసి వన్డేల్లో తన నాలుగో సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఆగిపోయాడు. జద్రాన్ కేవలం 9వ వన్డేలోనే ఆడుతున్నాడు. వన్డేల్లో గిల్ 10 మ్యాచ్ లలో 500 పరుగుల మైలురాయి అందుకోగా.. జద్రాన్ మాత్రం 9వ వన్డేలోనే ఈ ఘనత సాధించాడు.

వన్డేల్లో అత్యంత వేగంగా 500 పరుగులు చేసిన వాళ్లలో జద్రాన్ రెండోస్థానానికి దూసుకెళ్లాడు. తొలి స్థానంలో సౌతాఫ్రికా బ్యాటర్ జానెమన్ మలన్ ఉన్నాడు. అతడు ఏడు వన్డేల్లోనే ఈ ఘనత అందుకున్నాడు. జద్రాన్ దూకుడుతో శ్రీలంక విసిరిన 269 పరుగుల లక్ష్యాన్ని ఆప్ఘనిస్థాన్ 46.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేజ్ చేయడం విశేషం.

అంతకుముందు చరిత్ అసలంక 91, ధనంజయ డిసిల్వా 51 పరుగులు చేయడంతో శ్రీలంక 50 ఓవర్లలో 268 రన్స్ చేసింది. అయితే ఆ టీమ్ అంతగా అనుభవం లేని బౌలర్లతో బరిలోకి దిగడంతో ఆఫ్ఘన్ టీమ్ సులువుగా లక్ష్యాన్ని ఛేదించింది. ఐపీఎల్లో సీఎస్కే తరఫున చెలరేగిన మతీష పతిరన తొలి వన్డేలో తేలిపోయాడు. అతడు 8.5 ఓవర్లలో 66 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. అంతేకాదు ఏకంగా 16 వైడ్లు వేశాడు.

ఈ విజయంతో ఆప్ఘనిస్థాన్ మూడు వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. జద్రాన్ 98 రన్స్ చేయగా.. రెహ్మత్ షా 55, షాహిది 38 పరుగులు చేశారు. జద్రాన్, రెహ్మత్ షా రెండో వికెట్ కు 146 పరుగులు జోడించి లంక ఆశలపై నీళ్లు చల్లారు. జద్రాన్ ఇంతకుముందు ఆడిన 8 వన్డేల్లోనే మూడు సెంచరీలు బాదడం విశేషం. 9వ వన్డేలో నాలుగో సెంచరీకి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.

సంబంధిత కథనం