తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Dhoni To Odisha Train Victims: ఒడిశా రైలు ప్రమాద బాధితులకు ధోనీ రూ.60 కోట్ల సాయం.. ఇందులో నిజమెంత?

Dhoni to Odisha Train Victims: ఒడిశా రైలు ప్రమాద బాధితులకు ధోనీ రూ.60 కోట్ల సాయం.. ఇందులో నిజమెంత?

Hari Prasad S HT Telugu

06 June 2023, 17:38 IST

google News
    • Dhoni to Odisha Train Victims: ఒడిశా రైలు ప్రమాద బాధితులకు ధోనీ రూ.60 కోట్ల సాయం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఇందులో నిజమెంత? అతడు నిజంగానే ఈ భారీ సాయం చేస్తున్నాడా?
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం (Arabinda Mahapatra)

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం

Dhoni to Odisha Train Victims: ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం ఊహకందని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలుసు కదా. మూడు రైళ్లు ఢీకొన్న ఈ ప్రమాదంలో 278 మంది మరణించారు. అయితే ఈ ప్రమాద బాధితులకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రూ.60 కోట్ల సాయం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రెండు రోజులుగా వాట్సాప్ లో ఈ న్యూస్ చెక్కర్లు కొడుతూనే ఉంది. అయితే ఈ వార్తలో నిజమెంత? నిజంగానే ధోనీ ఇంత భారీ మొత్తాన్ని సాయంగా ఇస్తున్నాడా అంటే దీనికి సమాధానం కాదు అనే చెప్పాలి. ఈ వార్తలో అసలు ఎలాంటి నిజం లేదని తేలింది. అంతకుముందు విరాట్ కోహ్లి కూడా ఈ ప్రమాద బాధితులకు ఎంతో కొంత సాయం చేస్తున్నాడన్న వార్త వచ్చినా.. అది కూడా నిజం కాదని తేలింది.

అయితే మరో టీమిండియా క్రికెటర్ యుజువేంద్ర చహల్ మాత్రం ఈ ప్రమాద బాధితులకు సాయం అందించడానికి ముందుకు వచ్చాడు. అతడు బాధిత కుటుంబాల కోసం తన వంతుగా రూ.లక్ష విరాళం అందించాడు. కోరమాండల్, హౌరా ఎక్స్‌ప్రెస్ లతోపాటు గూడ్సు రైలు ఢీకొనడంతో ఈ పెను విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ ప్రమాదంలో మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ.. సోమవారం (జూన్ 5) నాటికి 278కి చేరింది. మరికొన్ని వందల మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే పలువురు క్రికెటర్లతోపాటు ఇతర క్రీడాకారులు కూడా తమ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందన్న అనుమానంతో ఈ కేసును సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే.

తదుపరి వ్యాసం