MS Dhoni Photo : పెళ్లి కార్డుపై ధోనీ ఫొటో.. ఫ్యాన్- డై హార్డ్ ఫ్యాన్
04 June 2023, 10:58 IST
- MS Dhoni Photo : ధోనీకి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు.. ఓ వ్యక్తి తన పెళ్లి కార్డుపై ధోనీ ఫొటో ముద్రించుకున్నాడు! ఈ ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
పెళ్లి కార్డుపై ధోని ఫొటో
MS Dhoni Photo on wedding card : టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇటీవలే 5వ ఐపీఎల్ కప్ గెలవడంతో ధోనీపై ఫ్యాన్స్ అభిమానం ఇంకాస్త పెరిగింది. ఒక రకంగా చెప్పాలంటే.. ఫ్యాన్స్‌కు ధోనీ దెవుడితో సమానం! ఈ విషయాన్ని రిజువు చేస్తూ.. తాజాగా ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ డై హార్డ్ ధోనీ ఫ్యాన్ చేసిన పని.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వ్యక్తి.. ధోనీ ఫొటోను తన పెళ్లి కార్డుపై ముద్రించుకున్నాడు!
ఫ్యాన్.. డై హార్డ్ ఫ్యాన్..!
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ వ్యక్తి, ధోనీపై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. తన పెళ్లి కార్డుపై ధోనీ జెర్సీ నెంబర్ 7తో పాటు అతని ఫొటోను ముద్రించాడు. 'తాలా' అని కార్డుపై రాయించుకున్నాడు. సాధారణంగా పెళ్లి కార్డులపై దేవుళ్ల ఫొటోలు ఉంటాయి. అంతేకాకుండా.. ఈ పెళ్లి కార్డును ధోనీకి కూడా పంపించాడు. తన ప్రత్యేకమైన రోజులో పాల్గొనాలని ఈ టీమిండియా మాజీ సారథిని ఆహ్వానించాడు.
ఇదీ చూడండి:- MS Dhoni Tears : చివరి ఓవర్లో ధోనీ టెన్షన్.. టెన్షన్.. గెలిచాక కన్నీళ్లు
సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ ఫొటోను ఓ వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. "సీఎస్కే #యెల్లోలవ్. దీనికి ముగింపు ఉండదు. ఛత్తీస్‌గఢ్‌లో ఓ ధోనీ ఫ్యాన్.. తన పెళ్లి కార్డుపై ధోనీ ఫొటోతో పాటు జెర్సీ నెంబర్ని కూడా ముద్రించాడు. చెన్నైసూపర్ కింగ్స్ సారథిని పెళ్లికి పిలిచాడు," అని క్యాప్షన్ ఇచ్చాడు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫొటోను ఇక్కడ చూడండి.
ధోనీకి సర్జరీ..
MS Dhoni latest news : ముంబైలోని ఓ ఆసుపత్రిలో గత గురువారం ధోనీకి సర్జరీ జరిగింది. సర్జరీ విజయవంతమైనందని వైద్యులు తెలిపారు. అయితే కొన్ని రోజుల పాటు ధోనీకి విశ్రాంతి అవసరమని పేర్కొన్నారు. సోమవారం.. ఐపీఎల్ కప్ గెలిచిన అనంతరం.. అహ్మదాబాద్ నుంచి ముంబైకి వెళ్లిన ధోనీ.. మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.